Govt of Telangana | File Photo

Hyderabad, March 26: తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. గ్రూప్‌-1 పోస్టులకు (Group-I posts) తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (Telangana State Public Service Commission) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న 503 పోస్టులను భర్తీ చేయనున్నది. ప్రిలిమ్స్‌ (preliminary test ), మెయిన్స్‌ (Mains) ద్వారా పోస్టులు భర్తీ చేయనున్నారు. తెలంగాణ ఏర్పాటైన అనంతరం తొలిసారిగా గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ (Group-I Notification) విడుదలైంది. ఇంటర్వ్యూలు లేకుండానే పోస్టులను భర్తీ చేయనున్నారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను టీఎస్‌పీఎస్సీ (TSPSC) స్వీకరించనున్నది.  జూలై లేదా ఆగష్టులో ప్రిలిమినరీ పరీక్షలు జరిగితే, ఇదే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి.

TSPSC Update: తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభమయ్యేనా? టీఎస్‌పీఎస్‌సీ నూతన చైర్మన్‌గా జనార్ధన్ రెడ్డి నియామకం, ప్రభుత్వ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపిన గవర్నర్

ఇందులో జిల్లా బీసీ అభివృద్ధి అధికారి పోస్టులు 5, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు 40, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు 38 భర్తీ చేయనున్నది. అలాగే అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీస్‌ 20 (పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్), డీఎస్పీ 91, జైళ్లశాఖలో డీఎస్పీ (DSP) పోస్టులు 2, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ 8, జిల్లా ఉపాధి అధికారి 2, జిల్లా మైనారిటీల సంక్షేమ అధికారి పోస్టులు 6, గ్రేడ్‌-2 మున్సిపల్‌ కమిషనర్‌ పోస్టులు 35 భర్తీ చేయనున్నది. వీటితో పాటు మండల పరిషత్‌ అభివృద్ధి అధికారి 121, జిల్లా పంచాయతీ అధికారి పోస్టులు 5, సీటీఓ 48, డిప్యూటీ కలెక్టర్లు (Dy. Collector) 42, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ 26, ప్రాంతీయ రవాణా అధికారి పోస్టులు 4, జిల్లా జిల్లా గిరిజన సంక్షేమ అధికారి పోస్టులు రెండింటిని భర్తీ చేయనున్నది.

Group-II Update: గ్రూప్-2 ప్రొవిజనల్ ఫలితాల లిస్టుపై హైకోర్ట్ స్టే, కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం, వారు తప్ప మిగతా అభ్యర్థుల నియామక ప్రక్రియ చేపట్టవచ్చు

ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ మే 2 నుంచి ప్రారంభమవుతుంది. దరఖాస్తులకు చివరి తేది మే 31. జూలై లేదా ఆగష్టులో ప్రిలిమినరీ పరీక్షలు జరిగితే, ఇదే ఏడాది నవంబర్ లేదా డిసెంబర్‌లో మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. ప్రిలిమ్స్ పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) 150 మార్కులకు జరిగితే, మెయిన్స్ పరీక్ష 900 మార్కులకు ఉంటుంది. మెయిన్స్‌లో ఇంగ్లీష్ (అర్హత పరీక్ష)తోపాటు మరో ఆరు సబ్జెక్టులు ఉంటాయి.