Mahabubabad, Mar 29: మహబూబాబాద్ మండలం కంబాల పల్లి వద్ద ఆర్టీసీ బస్సు చెట్టును ఢీ కొట్టింది. కామారెడ్డి నుంచి భద్రాచలంకు వెళుతున్న ఎక్స్ ప్రెస్ బస్సు ఎదురుగా వస్తున్న బర్రెను తప్పించబోయి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ (TSRTC Bus Hits Tree) కొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా 9మందికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు క్షతగాత్రులను మహబూబాబాద్ జిల్లా ఆస్పత్రికు తరలించి ప్రాథమిక చికిత్స అందించి వేరే బస్సులో భద్రాచలంకు పంపించారు.
ఇక జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వద్ద మంగళవారం ఉదయం హుండ్యాయ్ క్రేటా కారు(TS 08HJ 6665) బీభత్సం సృష్టించింది. హై స్పీడ్‌తో వెళ్తూ ఆటో, రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో కారు నడిపిన వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టు తెలిపారు.
నిన్న కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు కారు ఢీకొన్న ఘటనలో ( 5 People Killed in Bus-Car Collision) ఐదుగురు మృత్యువాత పడ్డడారు. కామారెడ్డి ( Kamareddy) వైపు నుంచి కరీంనగర్ వెళ్తున్న కారును ఎదరుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డీకొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఓ బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సు ముందరి టైరు పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లికి చెందినవారుగా భావిస్తున్నారు.