Two female students committed suicide in SC girls hostel (Photo/X/video Grab)

Hyd, Feb 5: తెలంగాణలోని యాద్రాద్రి భువనగిరి జిల్లాలో గల భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు (Two female students committed suicide) పాల్పడ్డారు. భువనగిరి పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్‌లో (SC girls hostel in Bhuvangiri) ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్‌ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు.

స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్‌లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్‌ వార్డెన్‌ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్‌లో జూనియర్, సీనియర్‌ విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్‌ ద్వారా సమాచారం చేరవేశారు.

వీడిన కడప హెడ్ కానిస్టేబుల్ సూసైడ్ కేసు, వివాహేతర సంబంధంమే నలుగురి ప్రాణాలను తీసిందని నిర్థారణకు వచ్చిన పోలీస్ ఉన్నతాధికారులు

విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్‌కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్‌ టీచర్‌ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్‌కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్‌ టీచర్‌ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.

Here's Protest Videos

అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్‌ కుమార్‌ తెలిపారు. వసతిగృహంలో విద్యార్థినుల మధ్య జరిగిన గొడవ కారణంగానే ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకొని ఉంటారని డీఈవో తెలిపారు.

టెన్త్‌ విద్యార్థినుల గదిలో దొరికిన సూసైడ్‌ నోట్‌ను తోటి విద్యార్థినులు పోలీసులకు అప్పగించారు. ‘మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేము చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు పడలేక పోతున్నాం. మా శైలజ మేడం తప్ప ఎవ్వరూ మమ్మల్ని నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయండి. మా ఆఖరి కోరిక ఇది..’ అంటూ భవ్య, వైష్ణవి నోట్‌ రాశారు.

అనకాపల్లిలో తీవ్ర విషాదం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విషం తాగి ఆత్మహత్య, అప్పుల భాదలే కారణం అంటున్న స్థానికులు

భవ్య 3 వతరగతి నుంచి ఇదే వసతి గృహంలో ఉంటున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్‌ జిల్లా నర్సంపేటకు చెందిన వీరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఏడవ తరగతి విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో భవ్య, వైష్ణవికి కౌన్సెలింగ్‌ ఇచ్చినట్లు వార్డెన్‌ శైలజ తెలిపారు. కాగా ఈ ఘటనపై వసతి గృహంలోని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మా బిడ్డలది ఆత్మహత్య కాదు హత్యే అంటూ తల్లితండ్రుల ఆందోళన చేస్తున్నారు.

ఈ సూసైడ్‌ నోట్‌పై మృతుల తల్లిదండ్రులు, ఐద్వా నాయకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్‌ మేడమ్‌ గురించి లేఖలో ఉంది తప్పితే, వారి తల్లిదండ్రుల గురించి లేదని, విద్యార్థులు రాసారని చెప్తున్న లెటర్‌ను నిపుణులతో పరిశీలించి నిజాలు బయటికి తీయాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి అనురాధ, ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ బట్టు రామచంద్రయ్య డిమాండ్‌ చేశారు. సూసైడ్‌ లెటర్‌పై అనుమానాలు ఉన్నాయని, ఉరేసుకుంటే పోలీసులకు ఎందుకు చెప్పలేదని మృతుల కుటుంబ సభ్యులు, వైష్ణవి మేనత్త సంధ్య హాస్టల్‌ అధికారులను ప్రశ్నించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకున్న ఇద్దరు విద్యార్థినుల కుటుంబాలకు మద్దతుగా హాస్టల్‌, ఏరియా ఆస్పత్రి ప్రధాన గేట్ల ఎదుట ఐద్వా, ఎస్‌ఎఫ్‌ఐ, వివిధ ప్రజాసంఘాలు, విద్యార్థి నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాస్తారోకో ఆందోళన చేపట్టారు. వందలాదిమంది రాస్తారోకోలో పాల్గొన్నారు. ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి బట్టుపల్లి అనురాధ శనివారం రాత్రి సంఘటన తెలిసిన వెంటనే అక్కడికి చేరుకొని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తెల్లవారుజామున వారు హాస్టల్‌లో జరిగిన సంఘటనపై విద్యార్థులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. హాస్టల్‌లో సీసీ కెమెరాలు లేవని, కనీస పర్యవేక్షణ లేదని ఆరోపించారు. మృతికి కారణాలను పూర్తిస్థాయిలో విచారణ జరిపి బయట పెట్టి కారకులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా, ఉద్యోగం కల్పించాలని కోరారు.

భువనగిరి ఎస్సీ వసతి గృహంలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌ కుమార్‌ రెడ్డి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. ఘటనపై కుటుంబ సభ్యులను పరామర్శించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతులు కోరిన విధంగా వరంగల్‌ జిల్లాలో లేక భువనగిరిలో స్థలంతో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం లేదా డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు అందిస్తామని తెలిపారు.

ఇదిలా ఉంటే భవ్య, వైష్ణవి మృతదేహాలపై పండ్లతో కొరికిన గాయాలు, వాతలతూ కూడిన ఫోటోలు కనిపించాయి. లేడీస్ హాస్టల్ లోకి వచ్చిన కొందరు ఆటో డ్రైవర్లు బాలికలతో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో కూడా సీనియర్, జూనియర్‌ విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది.