Telangana Weather Update: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు, విదర్భ వద్ద కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ
Rainfall -Representational Image | (Photo-ANI)

Hyderabad, Mar 21: మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో 900 మీటర్ల ఎత్తు వరకూ ఉన్న ఉపరితల ఆవర్తనం శనివారం మధ్యప్రదేశ్‌ వరకూ విస్తరించింది. కర్ణాటక నుంచి మరఠ్వాడా వరకూ అదే ఎత్తులో ఈ ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆది, సోమవారాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని (Telangana Weather Update) వాతావరణశాఖ తెలిపింది. రాత్రిపూట ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 3 డిగ్రీల వరకూ తక్కువగా ఉంటున్నాయి. గాలిలో తేమ పెరిగింది.

ఉప‌రి‌తల ద్రోణి కార‌ణంగా రాష్ట్రంలో ఈ నెల 23 వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నట్టు హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. కర్ణా‌టక తీరం నుంచి అంతర కర్ణా‌టక, దక్షిణ మధ్య మహారాష్ట్ర మీదుగా మరా‌ఠ్వాడ వరకు ఉప‌రి‌తల ద్రోణి 0.9 కిలో‌మీ‌టర్ల వరకు విస్తరించి ఉన్నది.

మెరుపు వరదలు..భయం గుప్పిట్లో వేలాదిమంది ప్రజలు, 1960 తర్వాత ఆ స్థాయి వరదలతో విలవిలలాడుతున్న ఆస్ట్రేలియా, జలమయమైన సిడ్నీ,న్యూసౌత్ వేల్స్

దీని ప్రభా‌వంతో రాష్ట్రంలో ఆది‌లా‌బాద్‌, కుమ్రంభీం ఆసి‌ఫా‌బాద్‌, నిర్మల్‌, నిజా‌మా‌బాద్‌, జగి‌త్యాల, రాజన్న సిరి‌సిల్ల, మంచి‌ర్యాల, కామా‌రెడ్డి జిల్లాల్లో ఉరు‌ములు, మెరు‌పు‌లతో తేలి‌క‌పాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.