Telangana Women's Commission on CMR College incident(video grab)

Hyd, January 2:  సీఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించింది మహిళా కమిషన్. సైబరాబాద్ కమిషనర్‌కు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. కాలేజీ ఘటనపై తక్షణమే నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాలేజీ బయట ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘాల నేతలతో చర్చించారు కళాశాల చైర్మన్ గోపాల్ రెడ్డి.

సీఎంఆర్ కాలేజీ ఘటనపై యాజమాన్యం నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదు అన్నారు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఫిర్యాదుతో దర్యాప్తు చేస్తున్నాం అన్నారు. విద్యార్థులు స్నానం చేస్తున్నప్పుడు బాత్రూం వెనుక భాగంలో వ్యక్తులు తచ్చాడుతున్నట్టు గమనించామని విద్యార్థులు మాకు చెప్పారు అన్నారు. సీఎంఆర్ కాలేజీ సెక్యూరిటీ రూం ధ్వంసం చేసిన విద్యార్థులు...పరిస్థితి ఉద్రిక్తం, నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వీడియోలు ఇవిగో

మహిళా పోలీసులతో బాత్రూముల దగ్గర చెక్ చేయించాం.. ఇద్దరి ఫింగర్ ప్రింట్స్ లభించాయి అన్నారు. మెస్‌లో పని చేసే వ్యక్తులు మాత్రమే లోపలికి వచ్చే అవకాశం ఉందని..ఆరుగురిని అదుపులోకి తీసుకుని, వారి 12 సెల్ ఫోన్లను సీజ్ చేశాం అన్నారు.

Telangana Womens Commission on CMR College incident

సీఎంఆర్ కాలేజీ ఘటనపై స్పందించిన మహిళా కమిషన్

ఇప్పటివరకు అయితే ఎలాంటి వీడియోలు లభించలేదు అని...ఈ ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతోందన్నారు.విద్యార్థులతో స్టేట్‌మెంట్‌ రికార్డు చేశాం...పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అన్నారు ఏసీపీ శ్రీనివాస్ రెడ్డి.

CMRIT గర్ల్స్ హాస్టల్లోని బాత్రూంలో విద్యార్థులు ఉండగా సిబ్బంది వీడియోలు తీశారని విద్యార్థినులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే.

ACP Srinivas Reddy on CMR College incident