Credits: X

Mancherial, Sep 3: మంచిర్యాలలో (Mancherial) ఘోరం జరిగింది. తాము పనిలోపెట్టుకున్న కుర్రాడు మేకను (Goat) ఎత్తుకుపోయాడనే అనుమానంతో అతడిని, అతడి స్నేహితుడిని ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసి చిత్రహింసలకు గురిచేసిన ఘటన తెలంగాణలోని (Telangana) మంచిర్యాల జిల్లాలో వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే, జిల్లాలోని మందమర్రికి చెందిన కొమురాజుల రాములు, అతడి భార్య స్వరూప, కుమారుడు శ్రీనివాస్ అంగడిబజార్‌ ప్రాంతంలో ఉంటున్నారు. వీరు పట్టణ శివారులోని గంగనీళ్ల పంపుల సమీపంలో షెడ్డు వేసి మేకలను పెంచుతున్నారు. తేజ(19) అనే యువకుడు వీరి ఇంట్లోనే ఉంటూ పశువుల కాపరిగా చేస్తున్నాడు. అతడి తల్లి పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తోంది. తండ్రి లేడు.

Silvina Luna: అయ్యో ఎంత ఘోరం.. కాస్మొటిక్‌ సర్జరీ వికటించి అర్జెంటీనా నటి, మోడల్ సిల్వినా లూనా మృతి

20 రోజుల క్రితం కనిపించకుండాపోయిన మేక

సుమారు 20 రోజుల క్రితం ఓ మేక, ఇనుప రాడ్డు కనిపించకుండా పోయింది. తేజతోపాటు అతడి దళిత స్నేహితుడు చిలుముల కిరణ్‌(30)పై యజమాని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఆ ఇద్దరినీ శుక్రవారం షెడ్డుకు పిలిపించింది. ఆ తరువాత వారిని కొట్టి, కాళ్లకు తాళ్లు కట్టి తలకిందులుగా వేలాడదీశారు. ఆపై తల కింద నేలపై నిప్పు పెట్టి చిత్ర హింసలకు గురిచేశారు. పొగతో ఊపిరాడక వారు నానా యాతన అనుభవించారు. ఆ తరువాత వారిద్దరినీ విడిచిపెట్టారు. రాములు, ఇతర కుటుంబసభ్యులపై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదుచేసి విచారణ ప్రారంభించారు.

Rains in Hyderabad: హైదరాబాద్ లో దంచికొట్టిన వాన.. తెల్ల‌వారుజామున పలు ప్రాంతాల్లో వరుణుడి బీభత్సం.. వివరాలు ఇవే