Hyd, Dec 26: తెలంగాణలో వాకింగ్ వెళ్లిన చేర్యలా జెడ్పీటీసీ సభ్యుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసిన ఘటన చేర్యాల మండలం గుర్జకుంటలో చోటుచేసుకుంది. చేర్యాల జెడ్పీటీసీ శెట్టె మల్లేశంపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం ఉదయం దాడికి పాల్పడ్డారు. వాకింగ్‌కు వెళ్లిన మల్లేశంపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేయడంతో బాధితుని తలకు తీవ్ర గాయాలయ్యాయి.
రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశంను స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో అతన్ని మొదట సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని ఓ యశోద ఆస్పత్రికి తరలించారు. సికింద్రాబాద్‌లోని యశోదా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మరణించారని (ZPTC member killed in attack) డాక్టర్లు తెలిపారు.ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.