
Hyderabad, March 10: తెలంగాణలో మళ్లీ కరోనా మహమ్మారి చాప కింద నీరులా విస్తరిస్తోంది. నిన్నటితో పోలిస్తే నేడు కోవిడ్ కేసులు మరిన్ని పెరిగాయి. అయితే చాలా మంది ఇప్పుడు గతంలో లాగా కరోనా అంటే భయం గానీ, కోవిడ్ నిబంధనలు పాటించడం గానీ చేయడం లేదు. దీనివల్ల వైరస్ వేగంగా విస్తరించి మళ్లీ లాక్డౌన్ నాటి పరిస్థితులు తలెత్తే అవకాశాలుంటాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నిన్న రాత్రి 8 గంటల వరకు 39,000 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 189 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 578 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 3,00,342కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 34 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, మేడ్చల్ నుంచి 12, మరియు రంగారెడ్డి నుంచి 15 కేసుల చొప్పున నమోదయ్యాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.
Telangana's COVID19 Bulletin:

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 31 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

గడిచిన 24 గంటల్లో మరో 2 కోవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 1,646కు పెరిగింది.
మరోవైపు మంగళవారం సాయంత్రం వరకు మరో 176 మంది మంది కోవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 2,96,916 మంది కోలుకున్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో 1780 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.