Telugu Akademi FD Scam: తెలుగు అకాడమి నిధుల స్కాం, అసలు సూత్రధారి సాయికుమార్‌, వివరాలను వెల్లడించిన సీపీ అంజనీకుమార్, కేసులో ఇప్పటివరకు మొత్తం 10 మంది అరెస్ట్
CP Anjani kumar (Photo-Twitter)

Hyd, Oct 5: హైదరాబాద్ లోని తెలుగు అకాడమిలో నిధుల గోల్ మాల్ వ్యవహారం (Telugu Akademi FD Scam) గతకొద్ది రోజుల నుంచి సంచలనంగా మారిన సంగతి విదితమే. తాజాగా ఈ కేసులో (Telugu Akademi misappropriation case) కీలక పరిణామం చోటు చేసుకుంది. చందానగర్‌ కెనరా బ్యాంక్‌ మేనేజర్‌ సాధనను సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు తెలుగు అకాడమీ స్కాంలో అరెస్టయిన వారి సంఖ్య పదికి చేరింది.

ఈ రోజు ఒక్క రోజే సీసీఎస్‌ పోలీసులు అరుగురిని అరెస్టు చేశారు. A1 మస్తాన్ వలీ, A2సోమశేఖర్ అలియాస్ రాజ్ కుమార్, A3 సత్యనారాయణ, A4 పద్మావతి, A5 మోహినుద్ధిన్, A6 వెంకట సాయి, A7 నండూరి వెంకట్, A8వెంకటేశ్వరరావు, A9 రమేష్, A10 సాధన ఉన్నారు. ఈ ముఠా గతంలోనూ పలు స్కాంక్‌లకు పాల్పడినట్లు తేల్చారు. యూబీఐ మేనేజర్ మస్తాన్ వలితో కుమ్మకైన నిందితులు తెలుగు అకాడమీ డిపాజిట్లు కాజేసినట్లు సీసీఎస్‌ పోలీసులు వెల్లడించారు.

తెలుగు అకాడమీలో ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కుంభకోణానికి సంబంధించి ప్రత్యేక బృందం ద్వారా దర్యాప్తు చేపట్టినట్లు హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ (hyderabad cp anjani kumar ) తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాడమీ అకౌంట్స్‌ అధికారి రమేశ్‌కు అక్రమాలకు పాల్పడిన ముఠాతో సత్సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. గతంలో కొందరిని అరెస్టు చేశామన్నారు. మరో 9 మందిని అనుమానితులుగా భావిస్తున్నట్లు చెప్పారు. వారి వివరాలను త్వరలో వెల్లడిస్తామని వివరించారు.

తెలంగాణలో బస్సు కారు ఢీ, అదుపుతప్పి లోయలో పడిన రెండు వాహనాలు, పెద్దపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకరు మృతి, 11 మందికి గాయాలు

మొత్తం రూ.64.5 కోట్ల నిధులు గోల్‌మాల్‌ చేశారు. కార్వాన్‌లోని యూనియన్ బ్యాంక్ నుంచి 26కోట్లు, రూ.11 కోట్లు సంతోష్ నగర్, చందనగర్ కెనరా బ్యాంక్‌లోని రూ. 6 కోట్లు కొల్లగొట్టారు. ఈ కుంభకోణంలో సాయికుమార్‌ కీలక నిందితుడు. ఇతనిపై గతంలో 3 కేసులున్నాయి’’ అని అంజనీకుమార్‌ తెలిపారు. కాగా, ఇవాళ సీసీఎస్‌ పోలీసులు బ్యాంకు ఏజెంట్లు సాయికుమార్‌‌, రాజ్‌కుమార్‌, వెంకట్‌తో పాటు చందానగర్‌ కెనరా బ్యాంకు మేనేజర్‌ సాధనను అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి నుంచే ఫిక్స్‌డ్ డిపాజిట్లను ముఠా మళ్లించినట్లు తేల్చారు.

డబ్బులన్నీ ఆగ్రసేన్ బ్యాంకు కోఆపరేటివ్ సొసైటీ ఖాతాలోకి వెళ్లాయి. అకాడమీ సభ్యుల లాగా ఆగ్రసేన్ బ్యాంక్‌లో ఖాతాలు తెలిచారు. సాయి కుమార్‌కి ఈ డబ్బులో అధిక శాతం వెళ్లాయి. మిగిలిన వారు ఒప్పందం ప్రకారం పంచుకున్నారు. కొంత నగదును ఖాతాల్లో నిలుపుదల చేశాం. పంచుకున్న డబ్బులతో నిందితులు ఆస్తులు కొన్నారు. కొంతమంది అప్పులు ఇచ్చారు. మార్కంటైల్ బ్యాంక్‌కు 10శాతం కమిషన్ వెళ్లింది’’ అని సీసీఎస్‌ జాయింట్‌ సీపీ అవినాష్‌ మహంతి తెలిపారు.

కేసు వెలుగులోకి ఎలా వచ్చింది.

తెలుగు అకాడమీ తన నిధులను వివిధ బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (ఎఫ్‌డీ) చేసింది. ఈ లావా దేవీలను దళారులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులు నడిపారు. వీరు పథకం ప్రకారం ఎఫ్‌డీ చేసిన సమయంలోనే ఆ పత్రాలను కలర్‌ జిరాక్స్‌ తీసుకున్నారు. సంతోశ్‌నగర్, కార్వాన్‌ల్లోని యూబీఐ, చందానగర్‌ కెనరా బ్యాంక్‌ శాఖల్లోని 12 ఎఫ్‌డీలుగా ఉన్న రూ.64 కోట్లు కాజేయడానికి కుట్రపన్నారు.

సిద్ధి అంబర్‌బజార్‌లోని ఏపీ మర్కంటైల్‌ కో-ఆపరేటివ్‌ క్రెడిట్‌ సొసైటీ లిమిటెడ్‌లో తెలుగు అకాడమీ పేరుతో ఖాతా తెరిచారు. ఆ సమయంలో నకిలీ గుర్తింపుకార్డులు, ఫోర్జరీ పత్రా లు సమర్పించారు. వాటి ఆధారంగా యూబీఐ కార్వాన్‌ బ్రాంచ్‌లోని రూ.43 కోట్లు, సంతోష్‌నగర్‌ బ్రాంచ్‌లో రూ.10 కోట్లు, చందానగర్‌ కెనరా బ్యాంక్‌ బ్రాంచ్‌లో రూ.11 కోట్లు లిక్విడేట్‌ చేశారు. తర్వాత తెలుగు అకాడమీ పేరుతో సొసైటీలో తెరిచిన ఖాతాల్లోకి మళ్లించి డ్రా చేసేశారు. సొసైటీకి 10 శాతం వరకు కమీషన్‌ ఇచ్చారు.

తెలంగాణలో 80 వేల ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, వచ్చే బడ్జెట్‌లో దళితబంధు పథకానికి రూ.20వేల కోట్లు, అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం కేసీఆర్, శాసనసభ గురువారానికి వాయిదా

అకాడమీ ఆస్తులు, నిధులను నిర్దేశిత నిష్పత్తి ప్రకారం ఏపీ, తెలంగాణ పంచుకోవాలని గత నెల 14వ తేదీన సుప్రీంకోర్టు ఆదేశించింది. దీంతో వాటి లెక్కలు చూడాలని అకాడమీ డైరెక్టర్‌ సోమిరెడ్డి ఆదేశాలు జారీచేశారు. అధికారులు ఈ నెల 18వ తేదీన బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి గడువు తీరిన, తీరని ఎఫ్‌డీలు రద్దు చేయాలని సూచించారు. ఈ నేపథ్యంలోనే కుంభకోణం వెలుగుచూసింది. అయితే అప్పటికే ముగ్గురు సూత్రధారులూ తమ ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరి కోసం గాలిస్తున్నామని సంయుక్త పోలీసు కమిషనర్‌ అవినాష్‌ మహంతి తెలిపారు.