Hyd, Sep 15:  ట్యాంక్ బండ్‌పై వినాయక నిమజ్జానానికి సంబంధించిన టెన్షన్ కొనసాగుతోంది. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం లేదంటూ ఫ్లెక్సీలను, బారీ కేడ్లను ఏర్పాటు చేశారు పోలీసులు. దీంతో అక్కడికి చేరుకున్న భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి నేతలు...ఫ్లెక్సీలు, బారీకేడ్లను తొలగించారు.

ట్యాంక్ బండ్‌కు ఏర్పాటుచేసిన జాలీలను తొలగించి వినాయకుని నిమజ్జనం చేశారు ఉత్సవ సమితి నేతలు. ట్యాంక్ బండ్ పై వినాయక నిమజ్జనం అనేక సంవత్సరాలుగా జరుగుతుందని...కొత్త రూల్స్ తీసుకువచ్చి గణేష్ ఉత్సవ సమితి భక్తుల మనోభావాలను ప్రభుత్వం, పోలీసులు దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. 2022లో, 23లో కూడా ఇదే విధంగా చెప్పారు కానీ చివరకు ట్యాంక్ బండ్లోని గణేష్ నిమజ్జనాలు జరిగిందన్నారు. రూ. కోటిన్నర కరెన్సీతో వినాయకుడికి అలంకరణ, వరంగల్ శివనగర్‌లో ప్రత్యేక ఆకర్షణగా 'ఘన'నాథుడు

Here's Video:

ప్రభుత్వం వెంటనే ట్యాంక్ బండ్ పై గణేష్ నిమజ్జన ఏర్పాట్లు ఈరోజు మధ్యాహ్నం వరకు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈరోజు అన్ని వినాయక మండపాల నిర్వాహకులకు సమాచారం తెలియజేసి రేపు నగరా వ్యాప్తంగా ఆందోళన చేసి నగరాన్ని స్తంభింప చేస్తాం అని హెచ్చరించారు.ఎక్కడికక్కడ మండపాల్లో వినాయకులను అదే విధంగా ఉంచుతాం అని భాగ్య నగర్ గణేష్ ఉత్సవ సమితి నేతలు హెచ్చరించారు.