Revanth Photo at Time Square

Newyork, Aug 6: అమెరికాలో (America) న్యూయార్క్‌ (Newyork) నగరంలో ఉన్న టైమ్స్ స్క్వేర్ (Time Square) బిల్డింగ్ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ప్రాంతమన్న విషయం తెలిసిందే. వాణిజ్య ప్రాంతంగానే కాకుండా ఒక టూరిస్ట్ డెస్టినేషన్ గా, వినోద కేంద్రంగా కూడా ఈ స్పాట్ అందరి మన్ననలను అందుకొంటుంది. ఇక్కడి బిల్లుబోర్డుల్లో నిత్యం వాణిజ్య ప్రకటనలు కనిపిస్తాయి. తమ ప్రకటనలు కూడా అక్కడ వేసుకుంటూ ఔత్సాహికులు ఆనందపడుతుంటారు. ఈ వీధి అంతా కోలాహలంగా, సందడిగా ఉంటుంది. వీడియో కాల్స్, సెల్ఫీలు తీసుకుంటూ జనాలు ఆనందంగా కనిపిస్తుంటారు. ఇప్పుడు ఇక్కడి ఓ బిల్లు బోర్డుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, ఆయనకు సంబంధించిన సమాచారాన్ని డిస్ ప్లే చేశారు. దీంతో తెలంగాణ ప్రవాసులైన ఎన్నారైలు అరుస్తూ కేరింతలు కొట్టారు.

మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు కేసుపై విచారణకు హాజరవ్వండి.. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ కు భూపాలపల్లి కోర్టు నోటీసులు.. మాజీ మంత్రి హరీశ్‌ రావు, మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డికి కూడా సమన్లు

తెలంగాణలోనూ..

అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ తరహాలోనే తెలంగాణ స్క్వేర్ పేరుతో ఐకానిక్ నిర్మాణం చేపట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీజీఐఐసీ ఆధ్వర్యంలో నిర్మాణం చేపట్టాలని సంకల్పించింది. ఆగస్టు 9వ తేదీ వరకు బిడ్‌ లను సమర్పించడానికి వీలు కల్పించారు. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీ సమీపంలో భారీ ప్లాజా నిర్మించాలని ప్రతిపాదించింది. మధ్య, దిగువ తరగతి ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించేలా ఈ నిర్మాణం ఉండాలని నిర్ణయించారు.

వీడియో ఇదిగో, స్టేజీ మీదనే యాంకర్ సుమ చేతికి ముద్దు పెట్టిన హాలీవుడ్ న‌టుడు డానియెల్‌, అన్నయ్యా రాఖీ వస్తుంది కదా అంటూ సుమ..