Drugs (Representational image/PTI)

Hyderabad, Aug 31: రాష్ట్రంలో డ్రగ్ కల్చర్ (Drugs) ను రూపుమాపడమే లక్ష్యంగా హైదరాబాద్‌ (Hyderabad), రంగారెడ్డి జిల్లాలోని పబ్బులు, బార్లలో శుక్రవారం రాత్రి అధికారులు సోదాలు నిర్వహించారు. ఎక్సైజ్‌‌, నార్కోటిక్‌ బ్యూరో (TG NAB) అధికారులు సంయుక్తంగా 25 పబ్బులపై దాడులు చేశారు. ఆయా పబ్బుల్లోని వారికి 107 డ్రగ్‌ డిటెక్షన్‌ కిట్లతో పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో ఆరుగురికి పాజిటివ్‌ గా తేలింది. ఈ మేరకు పాజిటివ్‌ తేలిన వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌లో మొదలైన వర్షం.. రాత్రి వరకు భారీ వానలు, ఏపీలోనూ ఇదే పరిస్థితి..వీడియోలు ఇవిగో

ఏ పబ్బుల్లో దొరికారంటే?

జీ40, విస్కీ సాంబ పబ్బుల్లో ఇద్దరు చొప్పున, జోరా పబ్బు, క్లబ్‌ రోగ్‌ లో ఒక్కొక్కరికి చొప్పున మొత్తం ఆరుగురికి పాజిటివ్‌ గా తేలినట్టు పోలీసులు పేర్కొన్నారు.

హైడ్రా దౌర్జన్యకాండపై కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు ఫైర్, కూల్చివేతలు అక్రమం , తనలాంటి వాల్లకే ఇలాంటి పరిస్థితి ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటని మండిపాటు!