TGSRTC Board takes key decision new bus depos and bus stands(X)

Hyd, Jan 18:  కొత్త డిపోలు, బస్ స్టేషన్లకు సంబంధించి ఆర్టీసీ బోర్డులో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో పలు కొత్త బస్సు డిపోలు, బస్ స్టేషన్ల నిర్మాణం, బస్ స్టేషన్ల విస్తరణకు అనుమతి తీసుకున్నారు. ఈ మేరకు కొత్త బస్సు డిపోల నిర్మాణం కోసం నిధులు కేటాయింపులకు అనుమతులు ఇచ్చారు.

పెద్దపల్లిలో కొత్త బస్సు డిపో నిర్మాణం కోసం రూ.11.70 కోట్లు కేటాయింపులకు అనుమతులు ఇవ్వగా ములుగు జిల్లా ఏటూరునాగారం బస్సు డిపో కోసం రూ.6.28 కోట్లు, ములుగులో కొత్త బస్ స్టాండ్ కోసం రూ.5.11 కోట్లు, మంగపేటలో కొత్త బస్ స్టేషన్ నిర్మాణానికి రూ. 51 లక్షలు కేటాయించారు.

సూర్యాపేట జిల్లా హుజూర్‌ నగర్‌‌ కు రూ. 3.75 కోట్లు కేటాయింపు, ఖమ్మం జిల్లా మధిరలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ.10.00 కోట్లు, సూర్యాపేట జిల్లా కోదాడ వద్ద ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 17.95 కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది.   వివిధ రంగాలలో తెలంగాణతో సింగపూర్​ ప్రభుత్వ భాగస్వామ్యంపై చర్చలు..సత్ఫలితాన్నిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్ టూర్

పెద్దపల్లి జిల్లా మంథని బస్ స్టేషన్ విస్తరణ కోసం రూ.95.00 లక్షలు, జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాళేశ్వరంలో ఆధునిక బస్ స్టేషన్ నిర్మాణం కోసం రూ. 3.95 కోట్లు కేటాయిస్తూ అనుమతులు ఇచ్చింది ఆర్టీసీ బోర్డు.