Hyderabad, Dec 16: హైదరాబాద్ (Hyderabad) శివారు సూరారం (Suraram) పోలీస్ స్టేషన్ పరిధిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ దొంగ (Thief) చేసిన పనితో పోలీసులకు ముచ్చెమటలు పడుతున్నాయి. నిన్న సాయంత్రం 4 గంటలకు మొదలైన డ్రామా (Drama) ఇంకా కొనసాగుతున్నది. అసలేమైందంటే.. ఓ ఇంటిలో దొంగతనం చేసి పారిపోయే క్రమంలో చెరువులో దూకి, మధ్యలో కూర్చుండిపోయాడు ఓ దొంగ. అతని కోసం పోలీసులు రాత్రి నుంచి ఇప్పటివరకూ వేచి చూస్తూనే ఉన్నారు. అతనిని చెరువు మధ్యలో నుంచి బయటకు రప్పించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. శుక్రవారం సాయంత్రం సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లోకి జొరబడి దొంగతనం చేశాడు. అతను బయటకు వెళ్లేలోపు ఇంటి యజమాని వచ్చాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కొంతదూరంలోని చెరువులో దూకాడు. ఈదుకుంటూ వెళ్లి చెరువు మధ్యలో ఉన్న బండరాయిపై కూర్చున్నాడు. విషయం తెలియగానే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతనిని బయటకు రప్పించే ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు.
చెరువులో దొంగ.. పోలీసుల ముప్పుతిప్పలు#Thief #Lake #Police #Suraram #Tnews pic.twitter.com/BsVacFXgvw
— TNews Telugu (@TNewsTelugu) December 16, 2023
మేడ్చల్ జిల్లా సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగ తప్పించుకునే క్రమంలో పోలీసులకు చుక్కలు చూపించాడు.https://t.co/tNbFXhjK2R
— Newsmeter Telugu (@NewsmeterTelugu) December 15, 2023
సీఎంను రప్పించాలని
పోలీసులు ఎంత నచ్చజెప్పినా దొంగ బయటకు రాలేదు. చీకటి పడటంతో పోలీసులు దొంగను ఎలా పట్టుకోవాలా? అని ఆలోచించి.. ఒకానొక దశలో 'పుణ్యం ఉంటది రారా.. బాబూ' అంటూ బతిమిలాడారు. అయితే, సీఎం రేవంత్ ను రప్పిస్తేనే తాను బయటకు వస్తానని దొంగ చెప్పడంతో పోలీసులు కంగుతిన్నారు. చెరువులోకి దూకిన దొంగ కళ్ళ ముందే కనిపిస్తున్నప్పటికీ ఎలా పట్టుకోవాలో తెలియని పరిస్థితి ఇప్పుడు నెలకొంది.