Hyderabad, July 16: తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలో గల తొర్రూరు మండలంలో లారీ బోల్తా (Thorrur Lorry Accident) పడింది. తొర్రూర్ లోని చీకటాయపాలెం గ్రామం (cheekatayapalem village)లోని “ఎక్కలదాయమ్మ చెరువు” కట్టమీద 11మంది కూలీలతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తాపడంతో నలుగురు కూలీలు (4 labourers killed) అక్కడికక్కడే మృతి చెందారు. అక్రమంగా కర్రల లోడుతో వెళ్తున్న లారీ అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. అయితే ఏడుగురు కూలీలు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. పొట్టకూటి కోసం దుబాయ్ వెళ్లి కరోనా భారీన పడ్డ తెలంగాణ వాసి, రూ.1.52 కోట్ల బిల్లును మాఫీ చేసి ఓదార్యాన్ని చాటుకున్న దుబాయ్ ఆస్పత్రి
మృతులు రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆంబోతుతండాకు చెందిన హర్యా, గోవిందర్, మధు, ధూర్యాగా గుర్తించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను వెలికి తీసి మృతదేహాలను పోస్టుమార్టంకు కోసం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తొర్రూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వేప, తుమ్మ కర్రలను కొనుగోలు చేసిన ఓ వ్యాపారి ఇక్కడి నుంచి రాత్రికి రాత్రే కర్రలను తరలించాలనుకున్నారు. కొనుగోలు చేసిన కర్రను లోడ్ చేసి తరలిస్తుండగా స్థానికంగా ఉన్న ఎక్కలదాయమ్మ చెరుపు కట్ట దగ్గరకు రాగానే లారీ అదుపుతప్పి బోల్తా పడింది. కట్టెల లోడుపై కూర్చున్న నలుగురు కూలీలు కర్రలన్నీ మీదపడడంతో సంఘటనా స్థలంలోనే చనిపోయారు. లారీ క్యాబిన్ లో కూర్చున్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా మరో ఐదుగురు కూలీలు సురక్షితంగా బయటపడ్డారు.