Boy Falls Into Borewell: బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడు, 25 ఫీట్ల లోతులో ఉన్నాడని అంచనా, సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు

Hyderabad, May 27: మెదక్ జిల్లాలోని (Medak district) పాపన్నపేట మండలం పోడ్చన పల్లి గ్రామంలో మూడేళ్ల బాలుడు బోరు బావిలో (Boy Falls Into Borewell) పడిపోయాడు. 120 అడుగులు లోతు తవ్వి నీళ్లు రావడం లేదని బోరు బావిని వదిలేసినట్టు స్థానికులు చెప్తున్నారు. బోరు సమీపంలో ఆడుకుంటూ వెళ్లిన సాయి వర్ధన్‌ ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేసీఆర్ సమీక్ష, రూ.1500 నగదు ఇచ్చే కార్యక్రమం మే నెల నుంచి కొనసాగదు, సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్న తెలంగాణ సీఎం

బోరు బావి (bore well) వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. మెదక్‌ రూరల్‌ ఎస్సై రాజశేఖర్‌, మరో ఎస్సై ఆంజనేయులు, స్థానిక అధికారులు ఘటనా స్థలానికి చేరకున్నారు. హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక బలగాలను తెప్పిస్తున్నామని అధికారులు తెలిపారు. తెలంగాణలో కరోనా పరీక్షల తీరుపై అసంతృప్తి వ్యక్తంచేసిన హైకోర్టు, జూన్ 4లోగా దీనిపై పూర్తి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు

కాగా 150 ఫీట్ల లోతు తవ్వి నీరు రాలేదని భూమి యజమాని వదిలేశాడు. బోరు బావిలో నీరు పడకపోవడంతో పూడ్చకుండా వదిలి వెళ్లాడు. బోరుబావి వేసిన అరగంటలోనే ప్రమాదవశాత్తు వర్దన్‌ పడిపోయాడు. రెండు జేసీబీలు, రెండు ఫైరింజిన్లతో సహాయ చర్యలను అధికారులు ముమ్మరం చేశారు. 150 ఫీట్ల లోతులో బోరు బావి ఉంది. 25 ఫీట్ల లోతులో ఆక్సిజన్‌ పైపు ఆగిపోయింది. చిన్నారి సంజయ్‌సాయి వర్దన్‌ 25 ఫీట్ల వరకే వెళ్లినట్లు అంచనా వేస్తున్నారు. సహాయ చర్యలను కలెక్టర్‌ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి పర్యవేక్షిస్తున్నారు.

Here's Video

Here's ANI Tweet

కాగా పటాన్‌చెరు నుంచి 4 నెలల క్రితం అమ్మమ్మ ఇంటికి వర్దన్ వచ్చాడు. మామ మంగలి బిక్షపతి చెందిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిని కుటుంబ సమేతంగా చూడటానికి వెళ్లిన సమయంలో నీరులేని బోరు బావిలో సాయి వర్ధన్‌ పడిపోయాడు. కళ్లముందే ఆడుకుంటూ వెళ్లిన బాలుడు ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడు క్షేమంగా బయటపడాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నారు.