KCR Attack On BJP: బీజేపీ చేసిన ఒక్క మంచి పని చూపించండి! మోదీ దేశానికి చేసింది సున్నా, అవసరమైతే కొత్త జాతీయపార్టీ పెడతా, బీజేపీపై ఫైరయిన సీఎం కేసీఆర్, సుధీర్ఘంగా సాగిన కేసీఆర్ ప్రెస్ మీట్
CM KCR Press Meet (Photo-CMO TS Twitter)

Hyderabad, July 10: ప్రధాని నేతృత్వంలోని బీజేపీ(BJP) ప్రభుత్వంపై సీఎం కేసీఆర్‌ (CM KCR) విరుచుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ప్రగతి భవన్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ. ‘ఈ దేశాన్ని ఓ జలగలాగా పట్టిపీడిస్తున్న భారతీయ జనతా పార్టీ (BJP) ప్రభుత్వం. క్రియాహీనమైనటువంటి. నిష్క్రియాపరమైనటువంటి, అవివేకమైన, అసమర్థమైన పాలన కొనసాగిస్తున్న నరేంద్ర మోదీ (Narendra Modi) ఆయన ప్రభుత్వం వారి జాతీయ పార్టీ కార్యవర్గ సమావేశాలు అని హైదరాబాద్‌లో పెట్టారు. ఏమిరా ఏంటే ఏమీ లేదు. ఓ జాతీయ పార్టీ, దేశాన్ని పాలించే పార్టీ కార్యవర్గ సమావేశాలు పెడితే.. దేశమంతా ఎక్స్‌పెక్ట్‌ చేస్తది. హైదరాబాద్‌లో మనం కాదు.. ఎంటైర్‌ కంట్రీ ఎక్స్‌పెక్ట్‌ చేస్తది. గతంలో వాళ్లుUPA  సాధించిన విషయాలు ఏకరువు పెట్టి చెబుతరు. ఫలితాలు ఏంటీ ? దేశానికి కలిగిన ప్రయోజనాలు ఏంటీ ? భవిష్యత్‌లో విజన్‌ ఏంటీ ? ఏం చేయబోతున్నరు జాతీయ కార్యవర్గ సమావేశాల ద్వారా సందేశం ఇస్తరు జాతికి. కానీ, అటువంటిది ఏమీ లేదు. సున్నా. జస్ట్‌ నథింగ్‌. ఆ ప్రధాని ఏం మాట్లాడిండో ఆ భగవంతునికి ఎరుక. ఆయనది ఆ కథ. ఆయనకు ముందు మాట్లాడిన మంత్రులు కేవలం కేసీఆర్‌ను తట్టి.. నోటిదూలను తీర్చుకొని పోయారు తప్ప.. ఏ విషయంలో ఏం చెప్పినట్లు లేదు. దాని తర్వాతనన్న ఏమైనా చెబుతున్నరా ? అని నాలుగు ఐదురోజులుగా చూస్తున్న’ అన్నారు.

‘రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి యశ్వంత్‌ సిన్హా (Yashwanth sinha) వచ్చారు. అనుకోకుండా కో ఇన్సిడెంట్‌గా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు(BJP National excutive meeting), మా సమావేశం జరిగింది. నేను ప్రధానమంత్రిని కొన్ని ప్రశ్నలు అడిగా. స్పష్టంగా, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా వీటికి సమాధానాలు చెప్పాలని అడిగా. ఆయన అవలంభిస్తున్న అవినీతి విధానాలు, దేశంలో జరుగుతున్న లక్షల కోట్ల కుంభకోణాలు, బీజేపీ అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రబలుతున్న ఆర్థికపరమైన ఇబ్బందులు ప్రజలకు సంబంధించినటువంటి. వీటిపై అడిగినా ఏ ఒక్కదానికి సమాధానం చెప్పలేదు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు.. మంత్రులు గానీ చెప్పలేదు. ఏం కారణం అనుకోవచ్చు మనం. అంటే ఏం లేదు. సరుకు లేదు.. సంగతి లేదు.. సబ్జెక్ట్‌ లేదు.. ఆబ్జెక్ట్‌ లేదు.. షుష్క ప్రియాలు.. శూన్య హస్తాలు.. అంతా డబ్బా.. బబ్రాజమానం.. భజగోవిందం.

ఇంతకు మించి ఏమీ లేదు. చాలా మంది ఆశిస్తరు. ప్రజలందరినీ ఆశోపాతులను చేశారు. సరే తెలంగాణకు వారు చేసిందేమీ లేదు. వాళ్ల అయ్యేది ఏమీ లేదు. తెలంగాణ వచ్చిన నుంచి చేసింది ఏమీ లేదు. దేశానికి ఏం చేయాలే.. తెలంగాణకు ఆయింత ఏమీ చేయలేదు. కాబట్టి తెలంగాణకు గురించి చెప్పింది లేమీ లేదు. అంతా ఒకరకమైన బీటింగ్‌ అరౌండ్‌ బుష్‌ దాకా జరిగింది తప్పా. దేశ ప్రజల పక్షాన మేం లేవనెత్తిన ప్రశ్నలకు గానీ, సమాధానం చెప్పలేము.. మేం అశక్తులం అని వారొ డొల్ల తనాన్ని రుజువు చేసుకొని పోయారు. దేశ ప్రగతికి సంబంధించినటువంటి గంభీరమైనటువంటి ఒక అవగాహన వ్యూహం, ఓ దార్శనితక ఏం లేదని బీజేపీ రుజువు చేసుకున్నది.

Telangana Rain Alert: తెలంగాణ ప్రజలకు రెడ్ అలర్ట్, 3 రోజులు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు, భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక, కుండపోత వానలు పడే అవకాశముందన్న ఐఎండీ  

అంతకు మించి ఏమీ లేదు. వాస్తవంగా సులభంగా ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలంటే.. నేను అడిగినా యశ్వంత్‌ సిన్హా సభలో.. ఏ దేశంలో పతనం కానీ రూపాయి.. భారత రూపాయి పతనమవుతుంది? కారణం ఏంటీ? నేను అడుగుతున్నా ఈ దేశంలో ఓ ముఖ్యమంత్రిగా’ అన్నారు. గత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూపాయి పడిపోయింది. మోదీ హయాంలో ఇంత భారీగా పడిపోవడానికి గల కారణాలపై ప్రశ్నించామన్నారు. భారతదేశం రూపాయి విలువ ఇంత దరిద్రంగా రూపాయి విలువ పడిపోయిందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది అవివేకమా? అసమర్థతనా? దీనికి దేశ ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?.. డబ్బాలో రాళ్లుపోసినట్లు అరచిపోతమంటే కుదరదు కదా?’ అంటూ మండిపడ్డారు.

Telangana Assembly Polls: వచ్చే ఎన్నికల్లో గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తా, హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రకటన, సువేందు అధికారి అడుగుజాడల్లో నడుస్తా..  

ఎనిమిదేళ్ల‌లో బీజేపీ స‌ర్కారు ఇచ్చిన ఒక్క హామీ కూడా నెర‌వేర్చ‌లేద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. తాము గెలిస్తే విదేశీ బ్యాంకుల్లో ఉన్న‌ బ్లాక్‌మనీ మొత్తం వాప‌స్ తెస్తాన‌న్నార‌ని, ఇప్పుడు అది డ‌బుల్ అయ్యింద‌ని తెలిపారు. మోదీ అస‌మ‌ర్థ‌త వ‌ల్లే విదేశీ బ్యాంకుల్లో మ‌న న‌ల్ల‌ధ‌నం రెట్టింపైంద‌ని మండిప‌డ్డారు. ఈ దేశానికి మాట‌లు చెప్పే ఇంజిన్ వ‌ద్ద‌ని, ప‌నిచేసే ఇంజిన్ కావాల‌న్నారు. బీజేపీ స‌ర్కారు చెట్టుపేరు చెప్పి కాయ‌లు అమ్ముకునే ర‌క‌మ‌ని విమ‌ర్శించారు. వీళ్లు హిందుత్వం పేరు చెప్పి రాజ‌కీయ ల‌బ్ధిపొందుతున్నార‌ని, వీరిగురించి కార్‌పాత్ర మ‌హారాజ్ అనే గురువు బుక్‌కూడా రాశాడ‌ని చెప్పారు.

కాశీ..హిందువుల‌కు ప‌విత్ర‌స్థ‌ల‌మ‌ని, త‌మ చివ‌రిద‌శ‌లో అక్క‌డే గ‌డ‌పాల‌ని అంతా అనుకుంటార‌ని సీఎం కేసీఆర్ చెప్పారు. అలాంటి ప‌విత్ర స్థలాన్ని కూడా మోదీ త‌న రాజ‌కీయం కోసం వాడుకున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. న‌ట్టుబోల్టుల‌తో కాశీలో ఘాట్లు నిర్మించార‌ని, మ‌ధ్య‌గోపురం మెయిన్ పిల్ల‌ర్ ప‌డిపోయింద‌ని చెప్పారు. ఇదే విష‌యంపై ఉత్త‌ర భార‌త‌దేశంలో లొల్లి న‌డుస్తున్న‌ద‌న్నారు. న‌రేంద్ర మోదీజీ హిందూ సంస్కృతిని గౌర‌వించే విధానం ఇదేనా? అని ప్ర‌శ్నించారు. ఓట్ల కోసం చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు.

మొన్న‌టిదాకా క‌శ్మీర్‌ఫైల్స్ (kashmir files)అనే సినిమాతో గోల్‌మాల్ రాజ‌కీయాలు చేశార‌ని, ఇప్పుడు క‌శ్మీరీ పండిట్లు రోజూ ధ‌ర్నా చేస్తుంటే కనిపించ‌డం లేదా? అని బీజేపీ స‌ర్కారును సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. మీ రాజ‌కీయ వికృత‌క్రీడ‌కోసం వారిని బ‌లితీసుకుంటారా అని ప్ర‌శ్నించారు. దేశ ఆర్థిక ప్ర‌గ‌తికి ప్ర‌ధానే గొడ్డ‌లిపెట్టు అయిత‌డా? అని ప్ర‌శ్నించారు. రాష్ట్రాల ప్ర‌గ‌తిని అడ్డుకుంట‌డా? అని నిల‌దీశారు. డ‌బుల్ ఇంజిన్ ఎందుకు సావ‌నీకా? గంగ‌లో పోనీకా? అని తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ దేశానికి న‌రేంద్ర మోదీ ఒక్క మంచి ప‌న‌న్నా చేశారా? అని ప్ర‌శ్నించారు. జీడీపీ(GDP) పోయింది.. రూపాయి ప‌డిపోయింది..నిరుద్యోగం పెరిగింది.. ఇవి వాస్త‌వాలు కాదా? అని అడిగారు. ఇంకా సిగ్గులేకుండా ఏక్‌నాథ్ శిందేల‌ను తెస్తామంటారా? అని మండిప‌డ్డారు. దేశప్ర‌జ‌లంతా దీన్ని వ్య‌తిరేకించాల‌ని పిలుపునిచ్చారు.

బీజేపీ పాల‌న‌లో దేశం ప్ర‌మాదంలో ఉంద‌ని, దీని ఆపాల్సిన బాధ్య‌త యువ‌త‌, మేధావులు, ఉద్యోగులు, జ‌ర్న‌లిస్టుల‌దేనని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. దేశ రాజ‌కీయాల‌నుంచి బీజేపీని త‌న్ని త‌రిమేయాల‌ని పిలుపునిచ్చారు. అప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంద‌న్నారు. తాను అడిగిన ఏ ఒక్క ప్ర‌శ్న‌కూ మోదీ వ‌ద్ద స‌మాధానం లేద‌న్నారు. మోదీ నుంచి స‌మాధానం రాద‌ని, ఎందుకంటే ఆయ‌న ద‌గ్గ‌ర స‌మాధానాలే లేవ‌ని య‌శ్వంత్ సిన్హా అన్నార‌ని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. స‌మాధానం చెప్ప‌క‌పోవ‌డం మేధావిత‌త్వ‌మా? అని ప్ర‌శ్నించారు. రేపు మోదీ ప్ర‌భుత్వాన్ని మారుస్తామ‌ని, ఎల్ఐసీని అమ్మనివ్వ‌మ‌ని పేర్కొన్నారు. గుజ‌రాత్ మోడ‌ల్ డూప్లికేట్ అని, గోల్‌మాల్ చేసి మోదీ ప్ర‌ధాని అయ్యాడ‌ని చెప్పారు.

న‌రేంద్ర మోదీ పాల‌న‌లో కార్పొరేట్ల‌కు మాత్ర‌మే లాభం జ‌రిగింద‌ని సీఎం కేసీఆర్ మండిప‌డ్డారు. మోదీ ఒత్తిడి వ‌ల్లే అత‌డి స్నేహితుడికి ప‌వ‌ర్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ ఇచ్చిన‌ట్లు శ్రీలంక ఎల‌క్ట్రిసిటీ బోర్డు అధ్య‌క్షుడే చెప్పార‌ని, ఇదే విష‌యంపై శ్రీలంక‌లో(Srilanka) ప్ర‌స్తుతం అగ్గి ర‌గులుతోంద‌న్నారు. శ్రీలంక‌లో దేశం ఇజ్జ‌త్ పోతున్న‌ద‌ని మండిప‌డ్డారు. భార‌త ప్ర‌ధానిస్థాయి దిగ‌జారింద‌ని విమ‌ర్శించారు. దీనిపై ప్ర‌ధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నాడో చెప్పాల‌ని నిల‌దీశారు. ఈ అరాచ‌కాల‌ను, దుర్మార్గాల‌ను ఇంకా భ‌రిస్తే దేశం స‌ర్వ‌నాశ‌న‌మైత‌ద‌న్నారు. చెడ‌గొట్ట‌డం.. కూల‌గొట‌ట్డం ఈజీ అని, పున‌ర్మిర్మాణం క‌ష్ట‌మ‌ని పేర్కొన్నారు.

టీఆర్ఎస్ జాతీయ‌పార్టీగా(TRS national Party) మారితే త‌ప్పేముంది?.. దేశంలో కొత్త పార్టీ రావొద్దా? అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు. టీఆర్ ఎస్ పెట్టిన‌ప్పుడు విమ‌ర్శించినోళ్లు ఇప్పుడేడున్న‌రు? అని అడిగారు. దేశ‌మేమ‌న్నా బీజేపీ నాయ‌కుల‌కు రాసిచ్చామా? అని ప్ర‌శ్నించారు. వీళ్లు దేశానికి చేసిందేంట‌ని నిల‌దీశారు. భార‌త‌దేశంలో కురిసే వ‌ర్ష‌పాతం ల‌క్షా 40వేల టీఎంసీల‌ని, న‌దుల‌నుంచి 70వేల టీఎంసీలు మ‌నం తీసుకోవ‌చ్చ‌న్నారు. ప్ర‌స్తుతం దేశం ఎత్తుకున్న‌ది 22వేల టీఎంసీలు మాత్ర‌మేన‌ని, మిగ‌తాదంతా స‌ముద్రంపాలే అవుతున్న‌ది సీఎం కేసీఆర్ వివ‌రించారు. ఇంత పెద్ద దేశంలో భారీ ప్రాజెక్టులు అవ‌స‌రం లేదా? అని ప్ర‌శ్నించారు.

జింబాజ్వేకు 6,500 టీఎంసీల రిజ‌ర్వాయ‌ర్ ఉన్న‌ప్పుడు మ‌న‌కు ఉండొద్దా? అని సీఎం కేసీఆర్‌ అడిగారు. ఎప్పుడూ ఏదో మూల క‌రువు వ‌స్త‌ది.. పిచ్చోళ్ల‌లాగా ఎర్రిమొహాలు వేసుకుని చూద్దామా? అని ప్ర‌శ్నించారు. భార‌త‌దేశ విస్తీర్ణం 83 కోట్ల ఎక‌రాల‌ని, 50శాతం అంటే 40 కోట్ల ఎక‌రాల వ్య‌వ‌సాయ అనుకూల భూమి ఉంద‌న్నారు. మ‌రి ఇక్క‌డ ప్ర‌పంచంలోనే ఉజ్వ‌ల‌మైన వ్య‌వ‌సాయం ఉండాలి క‌దా? అని అడిగారు. టీఆర్ఎస్ లాంటి స‌ర్కారు దేశంలో ఉంటే ప్ర‌తి ఎక‌రానికి నీళ్లు ఇవ్వొచ్చ‌న్నారు. ఇందుకోస‌మే కేసీఆర్ త‌ప‌న‌ప‌డుతుండు అని చెప్పారు. ప్ర‌తి ఒక్క‌రికీ చేతులెత్తి మొక్కుతున్నా.. చెడుపై పోరాటం చేయండి అని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.