Coronavirus in TS| (Photo Credits: PTI)

Hyd, Nov 21: తెలంగాణలో గత 24 గంటల్లో 925 కరోనా కేసులు (TS Corona Update) నమోదయ్యాయి. తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం... గత 24 గంటల్లో ముగ్గురు కరోనాతో ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 1,367 మంది కోలుకున్నారు. ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,62,653 కి (COVID-19 cases in Telangana) చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,49,157 మంది డిశ్చార్జ్ అయ్యారు.

మృతుల సంఖ్య మొత్తం 1,426 కి చేరింది. తెలంగాణలో ప్రస్తుతం 12,070 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 9,741 మంది హోంక్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 161 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 75 కేసులు నిర్ధారణ అయ్యాయి. ప్రస్తుతం కరోనా రికవరీ రేటు 94.86 శాతంగా ఉండగా.. మరణాల రేటు 0.54శాతానికి తగ్గింది.

కరోనా వైరస్‌ చికిత్సలో ప్రాచుర్యం పొందిన యాంటీవైరల్ మెడిసిన్ రెమిడిసివిర్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) శుక్రవారం సస్పెండ్ చేసింది. కరోనా చికిత్సలో సత్ఫలితాలు ఇస్తోందని ఇన్నాళ్లూ భావిస్తూ వచ్చిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ రెమిడెసివిర్‌తో కలిగే ప్రయోజనం ఏమీ లేదని డబ్ల్యూహెచ్‌వో తాజాగా తెలిపింది. ఆస్పత్రిలో చేరిన కోవిడ్‌ రోగులకు రెమిడెసివిర్‌ ఇవ్వొద్దని వైద్యులకు సూచించింది. ఈ ఔషధంతో రోగుల ప్రాణాలు కాపాడగలమనడానికి ఆధారాలు లేవని పేర్కొంది.

జాతీయస్థాయి పోటీ పరీక్షలను ప్రాంతీయ భాషలో నిర్వహించాలి, ప్రధానికి లేఖ రాసిన తెలంగాణ సీఎం కేసీఆర్, తెలుగు విద్యార్థులు నష్టపోతున్నారంటూ లేఖలో ఆవేదన

కాగా ఇప్పటివరకు కోవిడ్-19 కి వ్యతిరేకంగా ఆమోదించబడిన ఏకైక చికిత్స గా రెమి‌డెసివిర్‌ ఉంది. భారతదేశంలో, రిమిడెవిర్ సరఫరాను పెంచడానికి అనేక ఫార్మా సంస్థలతో గిలియడ్ నాన్-ఎక్స్‌క్లూజివ్ ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ తయారు చేస్తున్న కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఆస్ట్రాజెనికా వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి అందుబాటులోకి వస్తుందని వ్యాక్సిన్‌ తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈవో అదార్‌ పూనావాలా తెలిపారు. ఆరోగ్య రంగ సిబ్బందికి, వృద్ధులకి ఫిబ్రవరి నాటికే వ్యాక్సిన్‌ని ఇచ్చే అవకాశాలున్నాయని చెప్పారు.