Polls 2021 | (Photo-PTI)

Hyd, Dec 10: తెలంగాణ రాష్ట్రంలోని 6 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ముగిసింది. ఈ నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. కాగా నేటి ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ ప్రక్రియ (TS MLC Election 2021 Polling) సాయంత్రం 4 గంటలకు ముగిసింది. కరీంనగర్ జిల్లాలో 2, ఆదిలాబాద్ జిల్లాలో 1, నల్గొండ జిల్లాలో 1, ఖమ్మం జిల్లాలో 1, మెదక్ జిల్లాలో 1 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు నేడు పోలింగ్ నిర్వహించారు. 5 జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ నిర్వహించారు. అత్యధికంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 99.69 శాతం పోలింగ్ నమోదు కావడం విశేషం. కరీంనగర్ జిల్లాలో 1,324 ఓట్లు ఉండగా, నాలుగు ఓట్లు తప్ప మిగతావి అన్నీ పోలయ్యాయి.

మొత్తం ఓటర్లు 5 వేల 326 మంది. ఐదు జిల్లాల్లో ఏర్పాటు చేసిన 37 పోలింగ్ కేంద్రాల్లోనూ వెబ్‌ కాస్టింగ్‌, వీడియోగ్రఫీ ద్వారా ఓటింగ్ ప్రక్రియ మొత్తం రికార్డు చేశారు. 14న ఫలితాలు ప్రకటిస్తారు. ఆ రోజున మధ్యాహ్నంకల్లా ఫలితాలు (TS MLC Election 2021 Results) వెలువడనున్నాయి. లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 MLC స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార TRS పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు స్థానాల్లో ఇవాళ పోలింగ్‌ జరిగింది.