Hyderabad, May 21: కొత్త రేషన్ కార్డుల (New Ration Cards) కోసం ఏండ్లుగా ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. ఎన్నికల కోడ్ (Election Code) ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇండ్లు లేని ప్రతీ ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పారు. సోమవారం నేలకొండపల్లి మండలంలోని గువ్వల గూడెం, ముజ్జు గూడెం, అనాసాగరం, సదాశివపురం, పాత కొత్తూరు, నాచేపల్లి గ్రామాల్లో ప్రజలతో సమావేశమై ఈ మేరకు మాట్లాడారు.
అర్హులందరికీ ఇళ్లు, రేషన్ కార్డులు అందజేస్తాం
* సంక్షేమ పథకాల అమలులో రాజీ పడం
* తాగునీటి సమస్య లేకుండా పరిష్కరిస్తాం
* పాలేరు నియోజకవర్గ ప్రజల రుణo తీర్చుకుంటా
* రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి
* రెండో రోజు ముమ్మరంగా కొనసాగిన ప్రజల చెంతకే.. మీ శీనన్న కార్యక్రమం… pic.twitter.com/Vf9Xr4xD4f
— Ponguleti Srinivasa Reddy (@mpponguleti) May 20, 2024
ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తాం
ఇంకా సమావేశంలో మాట్లాడుతూ.. 'అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం. ఆగష్టు 15లోగా రుణమాఫీ చేస్తాం. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం' అని పొంగులేటి హామీ ఇచ్చారు.