Talcum Powder (Credits: X)

Newdelhi, May 21: ఇంట్లో రోజూ అందరం వాడే టాల్కమ్‌ పౌడర్‌ (Talcum Powder) తో మహిళల్లో అండాశయ క్యాన్సర్‌ వచ్చే (Ovarian Cancer) ప్రమాదం ఉన్నది. అమెరికాలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ పరిశోధకులు ఈ మేరకు వెల్లడించారు. రహస్య అవయవాలపై టాల్కమ్‌ పౌడర్‌ ను తరుచుగా వాడే మహిళల్లో ఈ ప్రమాదం ఎక్కువగా ఉన్నట్టు వివరించారు. మహిళలు జననాంగాల్లో టాల్కమ్‌ పౌడర్‌ వినియోగాన్ని నిలిపివేయాలని సూచించారు. 2003-2009 మధ్య అమెరికాలోని 50,884 మంది మహిళలపై ఈ పరిశోధనలు చేసినట్టు వివరించారు.

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం, సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్‌, తెలంగాణ కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలు ఇవిగో..

కారణమేంటంటే?

టాల్కమ్‌ పౌడర్‌ లో ఆస్బెస్టాస్‌ అనే ఖనిజాన్ని వినియోగిస్తారు. ఇది క్యాన్సర్‌ కు కారకంగా పనిచేస్తుందని, దీన్ని పీల్చినా కూడా ప్రమాదమేనని పరిశోధకులు చెబుతున్నారు. ఆస్బెస్టాస్‌ లేని టాల్కమ్‌ పౌడర్‌ తో పెద్దగా ప్రమాదం ఉండబోదని పేర్కొన్నారు. కాగా, జాన్సన్ బేబీ పౌడర్ లో క్యాన్సర్ కలిగించే పదార్థాలు ఉన్నట్టు వివాదం రేగడం తెలిసిందే.

తెలంగాణ రైతన్నలకు శుభవార్త.. వచ్చే నెల 5 - 11 మధ్య తెలంగాణలోకి రుతుపవనాల ప్రవేశం.. వాతావరణ శాస్త్రవేత్తల వెల్లడి