Hyd, mar 17: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) పేపర్ లీకేజీ అంశంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ గన్‌పార్కు అమరవీరుల స్థూపం వద్ద BJP రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) దీక్షకు దిగారు. అయితే, ఈ దీక్షకు అనుమతి లేదని తొలుత పోలీసులు తెలిపారు. అయినప్పటికీ దీక్ష చేపట్టడంతో పోలీసులు, బండి సంజయ్ మధ్య కాసేపు చర్చలు జరిగాయి. అనంతరం పోలీసులు కాస్త వెనక్కి తగ్గడంతో సంజయ్ దీక్ష కొనసాగించారు.భారీ ఎత్తున బీజేపీ నేతలు, శ్రేణులు అక్కడికి తరలివచ్చారు.
అనంతరం దీక్ష ముగించే సమయంలో టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి వెళ్తామని సంజయ్ ప్రకటించడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గన్‌పార్కు నుంచి టీఎస్‌పీఎస్సీకి బయలుదేరిన బీజేపీ నేతలను, బండి సంజయ్‌ను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. తర్వాత బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను పోలీసులు అరెస్టు చేసి వాహనంలో తరలించారు.
Here's BJP Tweet
గన్ పార్క్ వద్ద శ్రీ @bandisanjay_bjp అరెస్ట్ దృశ్యాలు pic.twitter.com/iAZNUtYEWG
— BJP Telangana (@BJP4Telangana) March 17, 2023
తొలుత బండి సంజయ్ పార్టీ కార్యాలయం నుంచి గన్‌పార్కుకు పాదయాత్ర చేపట్టారు. సంజయ్‌తోపాటు పార్టీ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆయనకు మద్దతు తెలుపుతూ దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై త్వరగా విచారణ చేపట్టాలని ఆందోళనకు దిగారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.