Hyd, Jan 4: తెలంగాణలో ఆర్టీసీ అద్దె బస్సుల సమ్మె లేదని (TSRTC Rental Bus Owners Strike Row) స్పష్టం చేశారు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్. గురువారం బస్ భవన్‌లో అద్దె బస్సు ఓనర్లతో ముగిసిన సమావేశం అనంతరం ఆయన వివరాలను వెల్లడించారు. ఆర్టీసీ అద్దె బస్సు ఓనర్లతో సమావేశంలో పలు అంశాలు చర్చించామని పేర్కొన్నారు. వారు కొన్ని సమస్యలను మా దృష్టికి తీసుకొచ్చారు. వారం రోజుల్లో అద్దె బస్సు ఓనర్ల సమస్యలు పరిష్కారించేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఇందుకు గాను సమస్యల పరిష్కారం కోసం ఒక కమిటీ వేస్తామని ఎండీ (TSRTC MD Sajjanar) తెలిపారు.
రేపటి నుంచి ఎలాంటి సమ్మె (Telangana Strike Row) ఉండదని, యధావిధిగా అద్దె బస్సులు నడుస్తాయని స్పష్టం చేశారు. సంక్రాంతికి కూడా ఫ్రీబస్ సర్వీస్ ఉంటుందని అలాగే సంక్రాంతికి స్పెషల్ బస్సులను కూడా నడుపుతామని సజ్జనార్ పేర్కొన్నారు. తెలంగాణలో ప్రస్తుతం 2700 అద్దెబస్సులు రన్ చేస్తున్నామని తెలిపారు. ఐదు సమస్యలను సజ్జనార్ కు విన్నవించామని ఆర్టీసీ అద్దెబస్సుల యాజమాన్యం ప్రెసిడెంట్ మధుకర్ రెడ్డి చెప్పారు. తమ సమస్యలను జనవరి 10 లోపు పరిష్కరిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారని చెప్పారు. జనవరి 5న తలపెట్టిన సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు.
ఆ బస్సు ప్రమాదం జరగడానికి అసలు కారణం అదే! వివరణ ఇచ్చిన సజ్జనార్
కాగా అంతకుముందు అద్దె బస్సు ఓనర్ల సంఘం నేతలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిశారు. సమస్యలు పరిష్కరించాలని మంత్రికి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం స్పందించకుంటే రేపటి నుంచి బస్సులు నడుపమని స్పష్టం చేశారు.