TSRTC Buses. | Photo - Wikimedia Commons

Hyderabad, December 27:  సంక్రాంతి పండగ కోసం తెలంగాణ ఆర్టీసీ (TSRTC) 4940 ప్రత్యేక బస్సులను ( Sankranti Special Services) నడుపుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. జనవరి 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఎంజీబీఎస్ మరియు జేబీఎస్ ల నుంచి అన్ని ముఖ్యమైన రూట్లలో సర్వీసులు నడుపుతామని అధికారులు పేర్కొన్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితమైన ప్రయాణం చేసి, భద్రంగా ఇళ్లకు చేరుకొని సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని అధికారులు ఆకాంక్షించారు.

ఇక అంతకుముందు జరిగిన సమావేశంలో డిమాండ్ ఎక్కువగా లేని రోజుల్లో గరుడ ప్లస్ (Garuda Plus) బస్సు ఛార్జీలను తగ్గించి తద్వారా ప్రయాణికుల సంఖ్యను పెంచుకునేలా తెలంగాణ ఆర్టీసీ సరికొత్త ప్రయోగాన్ని చేపట్టింది. ముందుగా బెంగళూరు = హైదరాబాద్  (HYD - BLR/ BLR- HYD) రూట్లో ఈ విధానం అమలులోకి తీసుకొచ్చింది. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసు పెంపు, ఆర్టీసీ కార్గో సేవల విస్తరణ

ఆర్టీసీ ఉద్యోగుల సమ్మె నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ ఇటీవల కిలోమీటరుకు 20 పైసల చొప్పున బస్సు ఛార్జీలను పెంచింది. దీంతో హైదరాబాద్ నుంచి బెంగళూరుకు గరుడ ప్లస్ ఛార్జీ రూ. 1300 అయింది. ఇది కర్ణాటక ఆర్టీసీతో పోలిస్తే ఎక్కువ, అటు ప్రైవేట్ సర్వీసులు కూడా డిమాండును బట్టి పెంచడం, తగ్గించడం చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రతీ శుక్ర, ఆదివారాల్లో గరుడ ప్లస్ ఛార్జీల్లో సవరణలు చేసింది. వారంలో 5 రోజుల్లో గరుడ ప్లస్ ఛార్జీలను రూ. 950కు తగ్గించింది.

ఇక శుక్రవారం బెంగళూరు టూ హైదరాబాద్, అలాగే ఆదివారం రోజు హైదరాబాద్ టూ బెంగళూరు ఛార్జీలను యధాతథంగా రూ. 1300 గానే ఉంచింది.

అయితే ప్రత్యేక సర్వీసుల్లో మాత్రం బస్సు ఛార్జీలలో ఎలాంటి మార్పు ఉండదు. అధికారుల నిర్ణయించిన ప్రకారమే టికెట్ ధరలు ఉండనున్నాయి.