TSPSC (Photo-Wikimedia Commons)

Hyderabad, April 07: టీఎస్‌పీఎస్సీ (TSPSC Leak) ప్రశ్నప‌త్రాల లీకేజీ ద‌ర్యాప్తులో సిట్ మ‌రో కీల‌క స‌మాచారాన్ని రాబ‌ట్టింది. ప్రశ్నప‌త్రాల లీకేజీలో కీల‌క నిందితుడైన ప్రవీణ్ నుంచి డీఏవో పేప‌ర్‌ను (DAO Paper Leak) కొనుగోలు చేసిన దంప‌తుల‌ను సిట్ అధికారులు అరెస్టు చేశారు. ఖమ్మంలో కార్ల వ్యాపారం నిర్వహించే సాయిలౌకిక్‌, సుష్మిత దంపతులు. సుష్మిత హైదరాబాద్‌లో సాప్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా ప‌ని చేస్తోంది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్ -1 (TSPSC Group 1), డీఏవో నోటిఫికేష‌న్లు విడుద‌ల కావ‌డంతో త‌న సాఫ్ట్‌వేర్ ఉద్యోగానికి సెల‌వు పెట్టి, పోటీ ప‌రీక్షల‌కు ప్రిపేర్ అయింది. గ‌తేడాది అక్టోబ‌ర్‌లో జ‌రిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష కూడా రాసింది. అయితే ఆమె ఓఎంఆర్‌ షీట్‌లో హాల్‌టికెట్ నంబ‌ర్‌ రాంగ్‌ బబ్లింగ్‌ చేసింది. దీంతో పరీక్షల ఫలితాలలో ఆమె పేపర్‌ను టీఎస్‌పీఎస్సీ అనర్హత జాబితాలో ఉంచింది. తాను ఓఎంఆర్‌ షీట్‌లో (OMR) రాంగ్‌ బబ్లింగ్‌ చేశానని, దానిని పరిగణలోకి తీసుకొని తనకు న్యాయం చేయాలంటూ ఆమె టీఎస్‌పీఎస్సీకి వచ్చి అధికారులను కలిసింది.

Modi Hyderabad Tour: ఈ సారి కూడా మోదీ టూర్‌కు కేసీఆర్ దూరం, మరోసారి తెరమీదకు ప్రోటోకాల్ వివాదాన్ని తీసుకువచ్చిన బీజేపీ 

అధికారులను కలిసే క్రమంలో కార్యదర్శి అనితా రాంచంద్రన్‌ పీఏగా పనిచేసిన ప్రవీణ్‌కుమార్‌ను కూడా కలిశారు. ఈ సందర్భంగా ప్రవీణ్‌ ముందు తన ఆవేదనను వ్యక్తం చేసింది. గ్రూప్‌-1 పరీక్ష ప్రిలిమ్స్‌లో క్వాలిఫై అయ్యేదాన్ని, కానీ రాంగ్‌ బబ్లింగ్‌ తనకు కష్టాలు తెచ్చిపెట్టిందని, తాను డీఏఓ (DAO) పరీక్షకు సిద్దమవుతున్నాను, టీఎస్‌పీఎస్సీ చుట్టూ తిరగడంతో సమయం వృధా అవుతుందంటూ ప్రవీణ్‌కు తెలిపింది. దీంతో ప్రవీణ్‌ తన వద్ద డీఏఓ మాస్టర్‌ ప్రశ్నపత్రం ఉందని, మీకు కావాలంటే ఇస్తానంటూ చెప్పాడు. దీంతో సుష్మ ఈ విషయంపై తన భర్తతో ఆలోచించి, ప్రవీణ్‌తో బేరం ఆడారు.

Bandi Sanjay: బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆలయంలో పూజలు నిర్వహించిన బండి సంజయ్, ఎస్‌ఎస్‌సి పేపర్ లీక్ కేసులో షరతులతో కూడిన బెయిల్ మంజూరు 

ఇందులో భాగంగా ముందుగా రూ. 6 లక్షలు ఇచ్చి, పరీక్ష ఫలితాలు వచ్చిన తరువాత మిగతా రూ. 4 లక్షలు ఇచ్చే విధంగా ఒప్పందం చేసుకున్నారు. ప్రశ్నా పత్రం ప్రింటెడ్‌ కాపీని సుష్మ దంపతులకు అందజేయడంతో, లౌకిక్ తన కార్ల కంపెనీ ఖాతా నుంచి రూ. 6 లక్షలు ప్రవీణ్‌ ఖాతాలోకి బదిలీ చేశాడు. ఫిబ్రవరి 26వ తేదీన ఈ పరీక్ష జరిగింది. టీఎస్‌ఎపీఎస్సీ పేపర్‌ లీకేజీ వ్యవహారం వెలుగులోకి రావడంతో ఈ పరీక్షను కూడా రద్దు చేసిన విషయం తెలిసిందే.