Representative Photo (Photo Credit: PTI)

Hyd, April 27: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.ఈ నెల 24న ఈ ప్రమాదం చోటు చేసుకుంది. జాన్స్ బర్గ్ హైవేపై వెళుతున్న కారు అదుపుతప్పి ఓ ట్రాక్టర్ ట్రెయిలర్ పైకి దూసుకుపోవడంతో ప్రమాదం చోటు చేసుకుంది. లిక్ గ్రీక్ రోడ్డు, అన్నా ప్రాంతంలో ఇది జరిగింది. కారు ఏప్రిల్ 24న కెంటకీలోని జాన్స్‌బర్గ్ హైవేపై ట్రాక్టర్-ట్రైలర్‌ను ఢీకొట్టింది.అయితే ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.

హైదరాబాద్‌లో ఎంసీఏ విద్యార్థి ఆత్మహత్య, సూసైడ్ నోట్ రాసి ప్రైవేట్‌ హస్టల్‌లో ఫ్యాన్‌కు ఉరి వేసుకున్న యువకుడు

షికాగోలో నివసించే హైదరాబాద్ కు చెందిన మిన్ హాజ్ అక్తర్ ఈ వివరాలు వెల్లడించారు. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్టు వెల్లడించారు. ప్రమాదంలో మరణించిన వారిని మహమ్మద్ ఫైసల్, ఇషాముద్దీన్ గా గుర్తించారు. గాయపడిన మరో వ్యక్తి సయ్యద్ ఫైసల్ ప్రాథమిక చికిత్స అనంతరం ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఉన్నత విద్య కోసం ఈ ముగ్గురు విద్యార్థులు అమెరికాకు వెళ్లగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఓ హైదరాబాద్ వ్యక్తి సహకారంతో మృతదేహాలను 25న సమాధి చేసినట్టు సామాజిక కార్యకర్త, అమ్జద్ ఉల్లా ఖాన్ తెలిపారు.

విశాఖ బీచ్‌లో గర్భిణి మహిళ మృతి కేసులో పురోగతి, అత్తమామల వేధింపులతో ఆత్మహత్య చేసుకుందని నిర్థారించిన పోలీసులు

సెయింట్ లూయిస్‌లోని దార్-ఉల్-ఇస్లాం మసీదులో అంత్యక్రియల ప్రార్థనలు (నమాజ్-ఎ-జనాజా) జరిగాయని సామాజిక కార్యకర్త, MBT నాయకుడు అమ్జెద్ ఉల్లా ఖాన్ బుధవారం తెలిపారు. అనంతరం మృతి చెందిన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. అమెరికాలో స్థిరపడిన హైదరాబాద్ వ్యక్తి సహాయంతో ఏప్రిల్ 25న అంత్యక్రియలు జరిపినట్లు తెలిపారు. మిస్సౌరీ ఇస్లామిక్ సెంటర్ కూడా మరణించిన విద్యార్థుల కుటుంబాలకు సహాయం చేయడానికి ముందుకు వచ్చిందని MBT నాయకుడు తెలిపారు.