Hyd, Jan 19: రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరొకరికి గాయాలు అయ్యాయి. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రామోజీ ఫిల్మ్ సిటీ మేనేజ్‌మెంట్‌ను నిందితులుగా చేర్చారు. ఓ కార్పొరేట్ ఈవెంట్ జరుగుతుండగా, క్రేన్ విరిగిపడడంతో 'విస్టెక్స్' సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవో సంజయ్ షా మృతి చెందారు. కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజు గాయపడ్డారు.
అంబర్ పేటలో దారుణం, ప్రేమించడం లేదని అమ్మాయిని కత్తితో పొడిచిన బాలుడు, అనంతరం రైలు కింద పడి ఆత్మహత్య
అబ్దుల్లాపూర్‌మెట్ ఇన్‌స్పెక్టర్ ఎ మన్మోహన్ తెలిపిన వివరాల ప్రకారం..విస్టెక్స్ కంపెనీ తమ సిల్వర్ జూబ్లీ వేడుకలను రామోజీ ఫిలింసిటీలో నిర్వహించుకుంటోంది. కొందరు అతిథులను కొంత ఎత్తు నుంచి నేరుగా వేదిక మీదకు దించుతుండగా, క్రేన్ కు ఉన్న తీగలు తెగిపోయాయి. దాంతో ఆ అతిథులు ఉన్న కంపార్ట్ మెంట్ పై నుంచి పడిపోయింది. తీవ్రగాయాలతో విస్టెక్స్ కంపెనీ సీఈవో సంజయ్ షా అక్కడికక్కడే చనిపోయాడు. మృతిని పోలీసులు ధృవీకరించారు. మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు.
ఈ ప్రమాదంలో కంపెనీ చైర్మన్ విశ్వనాథరాజుకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం. ఆయన్ని మలక్‌పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.వెస్టెక్స్ ఆసియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జానకిరామ్ రాకు కలిదిండి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామోజీ ఫిలిం సిటీ ఈవెంట్ అధికారులు ఇన్‌స్పెక్టర్ మన్మోహన్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.