Attack on a friend for not providing slips in exams in Hyderabad

హైదరాబాద్ - చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. పరీక్షల్లో చిట్టీలు అందించలేదని ఆరిఫ్ అనే విద్యార్థితో కసబ్ గొడవపడి విచక్షణా రహితంగా కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. వివరాల్లోకెళితే..పాతబస్తీ ఛాదర్‌ఘాట్ పరిధిలో నివాసం ఉండే కసబ్, ఆరిఫ్ అనే విద్యార్థులు ఎస్ఐఎస్ వొకేషనల్ జూనియర్ కాలేజీలో కాలేజీలో చదువుతున్నారు. ప్రస్తుతం కాలేజీలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆరిఫ్, కసబ్ ఇద్దరూ పరీక్ష రాస్తున్న సమయంలో కసబ్.. ఆరిఫ్ నుంచి చీటి అడిగాడు. అయితే, ఆరిఫ్ చీటి ఇవ్వకపోవడంతో పరీక్ష హాలులోనే కసబ్ కోపంతో ఊగిపోయాడు.

నెల క్రితం తగిలిన గాయానికి కట్టు కట్టుకుని మేము కొట్టినట్లు నాటకమాడారు,  యూనివర్సిటీలో ఏబీవీపీ విద్యార్థులు దాడి ఘటనపై వరంగల్ సీపీ రంగనాథ్

పరీక్ష అయిపోగానే పార్కింగ్ సెల్లార్ లో తనకు చీటి అందించకపోవడంపై కసబ్.. ఆరిఫ్ ను నిలదీశాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. అప్పటికే ఆవేశంతో ఊగిపోతున్న కసబ్.. ఆరిఫ్ పై దాడికి తెగబడ్డాడు. స్నేహితుడు అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా కొట్టాడు. రక్తమోడుతున్న ఆరిఫ్ ను నడవలేని స్థితిలో అక్కడి నుంచి విద్యార్థులు మోసుకెళ్లారు.

Here's Video

స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించారు. అయితే కసబ్ తీవ్రంగా కొట్టడంతో.. ఆరిఫ్ మెదడులో రక్తం గడ్డకట్టిందని, ప్రస్తుతం ఆరిఫ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకు ఆరిఫ్ తల్లిదండ్రులు పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న ఛాదర్ ఘాట్ పోలీసులు దర్యాప్తు మొదలు పెట్టారు. దీనికి సంబంధించిన సీసీ పుటేజీ వైరల్ అవుతోంది.