
Hyd, July 28: తెలంగాణలో మరో మూడు రోజులపాటు భారీ వర్షాలకు (Heavy rains forecast in Telangana) అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. . ఈనేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు వర్షాలపై జీహెచ్‌ఎంసీ అత్యవసరంగా సమావేశమైంది. జీహెచ్‌ఎంసీలో (GHMC) కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.అత్యవసరం ఏదైనా ఉంటే కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లు 040-21111111, 040-29555500కు ఫోన్ చేయాలని జీహెచ్ఎంసీ సూచించింది.
కాగా గురువారం పలు చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడ్డాయి. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని (Hyderabad) కొన్ని ప్రాంతాల్లో నేటి సాయంత్రం వానలు కురిశాయి. అయితే, మరో మూడు రోజులపాటు తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఈనేపథ్యంలో ప్రభుత్వం హైఅలర్ట్ ప్రకటించింది. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాని ఆదేశాలు జారీ చేసింది. దీంతోపాటు వర్షాలపై జీహెచ్‌ఎంసీ అత్యవసరంగా సమావేశమైంది. జీహెచ్‌ఎంసీలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.
మూసీనది ఉగ్రరూపం దాల్చింది. వారం రోజులుగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు జంట జలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌లకు వరదనీరు పోటెత్తుతోంది. దీంతో జలమండలి అధికారులు వరుసగా జలాశయాల గేట్లను తెరచి మూసీలోకి వరద నీటిని వదిలిపెడుతున్నారు. బుధవారం ఏకంగా గండిపేట్‌కు 13, హిమాయత్‌సాగర్‌కు 8 గేట్లను ఎత్తివేశారు. దీంతో మూసీలో వరదనీటి ఉద్ధృతి అనూహ్యంగా పెరిగింది.
నగరంలో మూసీ ప్రవహించే బాపూఘాట్–ప్రతాపసింగారం (44 కి.మీ)మార్గంలో మూసీ మునుపెన్నడూ లేనివిధంగా పరవళ్లు తొక్కుతోంది. ఇదే క్రమంలో చాదర్‌ఘాట్ మూసీ చిన్న వంతెనపై నుంచి వరద ప్రవాహం పెరగడంతో ట్రాఫిక్‌పోలీసులు ఈ బ్రిడ్జీని మూసివేశారు. మూసారాంబాగ్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొనడంతో వంతెన పైనుంచి రాకపోకలను నిలిపివేశారు