Weather report: Heavy rains likely in Andhra Pradesh for next two days (Photo-Twitter)

Hyd, June 14: నైరుతి రుతుపవనాలు సోమవారం రాష్ట్రంలోకి ప్రవేశించాయి. మహబూబ్‌నగర్‌ జిల్లా వరకు అవి విస్తరించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ప్రస్తుతం రుతుపవనాల వ్యాప్తికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు తెలిపింది. రాష్ట్రంలో నైరుతు రుతుపవనాల ప్రభావంతో వర్షాలు (Light To Moderate Rain) కురుస్తున్నాయి. రానున్న రెండు మూడు రోజులు (Telangana In Next 48 Hours) రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. మరో నాలుగురోజుల్లో రాష్ట్రమంతటా రుతుపవనాలు వ్యాప్తి చెందే అవకాశంఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

అదేవిధంగా రాజధాని నగరం హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన ఉన్నదని హెచ్చరించింది. నగరంలో మూడు రోజులపాటు అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీంతో అధికారులు మున్సిపల్‌ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రహదారుపై ఎక్కడ నీరు నిలువకుండా చూడాలని సూచించారు. కాగా, కాస్త ఆలస్యమైనప్పటికీ రాష్ట్రంలోకి రుతుపవనాలు సోమవారం ప్రవేశించాయి. దీంతో జయశంకర్‌ భూపాలపల్లి, మంచిర్యాల, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిశాయి. హదరాబాద్‌తోపాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదయింది.

తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు రేపే, tsbie.cgg.gov.in వెబ్‌సైట్లో ఫలితాలు చెక్ చేసుకోండి

సాధారణంగా జూన్‌ మొదటివారంలో రాష్ట్రంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించేవి. ఈ ఏడాది మే నెల 30న కేరళను తాకిన రుతుపవనాలు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతో అవి మందగించాయి. ఆ తర్వాత పశ్చిమదిశల నుంచి గాలుల ప్రభావంతోపాటు ఇతర పరిస్థితుల వల్ల రుతుపవనాల కదలికల్లో చురుకుదనం ఏర్పడింది. దీంతో వాటి వ్యాప్తి సంతృప్తికరంగా ఉన్నట్లు వాతావరణ నిపుణులు చెబుతున్నారు.