Telangana COVID Bulletin: తెలంగాణలో కొత్తగా మరో 631 మందికి కరోనా పాజిటివ్, మరో 802 పైగా రికవరీ, రాష్ట్రంలో 8 వేలకు తగ్గిన ఆక్టివ్ కేసుల సంఖ్య
Coronavirus Outbreak in TS (Photo Credits: IANS)

Hyderabad, December 4: తెలంగాణలో కరోనావైరస్ వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. నిన్న రాత్రి 8 గంటల వరకు నిర్ధారించిన పరీక్షల మేరకు గత 24 గంటల్లో 57,405 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 631 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 658 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 56,62,711 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.

తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 272,123కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 109 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా,  మేడ్చల్ నుంచి 57, రంగారెడ్డి నుంచి 49 మరియు కరీంనగర్ నుంచి 34  కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

Telangana's COVID19 Bulletin:

Status of positive cases of #COVID19 in Telangana

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 32 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

Status of positive cases of #COVID19 in Telangana

మరోవైపు గత 24 గంటల్లో మరో 2 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,467కు పెరిగింది.

అలాగే, గురువారం సాయంత్రం వరకు మరో 802  మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 261,830 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 8,826 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.