Wine Shop Timings in TS: మందుబాబులకు శుభవార్త, తెలంగాణలో రాత్రి 9.30 వరకు షాపులు ఓపెన్, వివరాలను వెల్లడించిన ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌
Chhattisgarh launches portal for home delivery of liquor to avoid crowding during lockdown (Photo-ANI)

Hyderabad, July 2: తెలంగాణలో వైన్‌షాపులు(Wine Shops in TS) గురువారం నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంటాయని (open till 9.30 pm in Telangana) ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ బుధవారం తెలిపారు. పేద ప్రజలతో చెలగాటం ఆడుతున్న గుడుంబా తయారీని పూర్తిగా అరికడతామని, దాన్ని తయారు చేసేవారిపై పీడీ యాక్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవో ప్రకారం వైన్‌షాపుల సమయాన్ని పెంచామని మంత్రి (Minister Srinivas Goud) తెలిపారు. తెలంగాణలో ఒక్కరోజులోనే 1000కి పైగా కేసులు, రాష్ట్రంలో 17 వేలు దాటిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, 267కు పెరిగిన మరణాలు

తెలంగాణను సీఎం కేసీఆర్‌ గుడుంబా రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చారని పేర్కొన్నారు. బెల్లం సరఫరా, అక్రమమద్యం సరఫరా, గుడుంబా తయారు చేసేవారి సమాచారం తెలిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని, ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచి, తగిన పారితోషికం ఇస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.

తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభణ కొన‌సాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 4,234 టెస్టులు నిర్వ‌హించ‌గా కొత్తగా 1,018 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 17,357కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కరోనాపై హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. తాజాగా కరోనా నుంచి కోలుకున్న 788 మంది డిశ్చార్జ్‌ కావడంతో.. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 8,082గా నమోదైంది.

ప్రస్తుతం రాష్ట్రంలో 9,008 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కాగా నేడు కరోనాతో మరో ఏడుగురు మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 267కి చేరింది. తాజాగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 881 ఉండ‌టం ఆందోళ‌న రేకెత్తిస్తోంది