
Warangal, March 10: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Rajaiah) మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నారని (sexual harassment) నీకు డబ్బు కావాలన్నా..బంగారం కావాలన్నీ ఏది కావాలన్నా ఇస్తాను నా కోరిక తీర్చు అంటూ వేధిస్తున్నారని జానకీపురం మహిళా సర్పంచ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంచలన ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Taikonda rajaiah) తీవ్రంగా ఖండించారు. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో కొంతమంది నాపై కుట్ర పన్ని ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని నేను ఎవ్వరికి ఫోన్లు చేయలేదు..ఎటువంటి వేధింపులకు పాల్పడలేదని రాజయ్య తెలిపారు.
నాపై రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని ఇటువంటి కుట్రలు నాపై జరగటం తొలిసారి కాదని గతంలో కూడా జరిగాయని చెప్పుకొచ్చారు తాటికొండ రాజయ్య. నాపై వచ్చిన ఆరోపణలు కేవలం రాజకీయ కుట్రలో భాగమని గత ఎన్నికల్లో చేసినట్లుగానే ఇప్పుడు కూడా నాపై కుట్రలు చేస్తున్నారని నాపై వచ్చిన ఈ ఆరోపణల గురించి స్వయంగా సీఎం కేసీఆర్ ను..కలిసి అన్నీ వివరిస్తానని తెలిపారు. ఇంటి దొంగలే శిఖండులగా మారి నాపై ఇటువంటి కుట్రలు చేసి రాజకీయంగా నన్ను దెబ్బతీయాలను చూస్తున్నారని చెప్పుకొచ్చారు రాజయ్య. ప్రజల్లో తనకు ఉన్న ఆదరణకు సహించలేని కొంతమంది చేసే కట్ర అంటూ కొట్టిపారేశారి ఎమ్మెల్యే రాజయ్య.