Hyderabad, August 19: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం (KCR’s Health Rumours) చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. లుక్ ఔట్ నోటీస్ ద్వారా రాజు అనే యువకుడిని ముంబై ఏయిర్ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. జగిత్యాలకు చెందిన రాజు అనే యువకుడు కేసీఆర్ కు (Telangana Chief Minister K Chandrasekhar Rao) కరోనా సోకిందని గాంధీ అస్పత్రి వైద్యులు నిర్ధారించారని, ఆయన చనిపోయారంటూ తప్పుడు వార్తను (spreading rumours) సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు.
జూన్ లో అతను పోస్ట్ చేయగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు (Cyber Crime police) లుక్‌ఔట్ నోటీసులు జారీ చేశారు. సౌదీ అరేబియా నుండి తిరిగి వచ్చిన రాజును ముంబై ఏయిర్ పోర్ట్‌లో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు... రాజును ముంబై నుండి హైదరాబాద్ తీసుకువచ్చారు. ఈ కేసులో అతన్ని పోలీసులు జ్యుడీషియల్ కస్టడికి పంపారు. తెలంగాణ పోలీసుల హెచ్చరిక, సోషల్ మీడియాలో విద్వేషకర పోస్టులు పెడితే కఠిన చర్యలు, రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై నిరంతరం నిఘా ఉంటుందని తెలిపిన తెలంగాణ డీజీపీ
ఇదిలా ఉంటే తెలంగాణ పోలీసులు (TS Police) సోషల్ మీడియాపై నిఘా పెంచారు. 24 గంటలూ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో నిఘా ఉండేలా ఏర్పాటుచేశారు. ఎవరైనా సోషల్ మీడియాలో విద్వేషపూరిత పోస్టులు పెట్టినా, వివాదాస్పద కామెంట్లు చేసినా, పుకార్లు, వదంతులు పుట్టించినా.పోలీసులు రంగంలోకి దిగుతారు. బెంగుళూరు అల్లర్ల ఘటన తరవాత తెలంగాణ పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఇంతకుముందు కూడా సీఎం కేసీఆర్‌పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టులు చేశారు.