HYD Woman Murder: ప్రేమించాడు..సోదరుడితో కలిసి ప్రియురాలి గొంతు కోసి చంపేశాడు, హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు

తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించావు..నన్ను పెళ్లి చేసుకో అన్నందుకు ఓ యువతిని ప్రియుడు తన సోదరుడితో కలిసి దారుణంగా హత్య (HYD Woman Murder) చేశాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ హైదరాబాద్‌ రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

HYD Woman Murder: ప్రేమించాడు..సోదరుడితో కలిసి ప్రియురాలి గొంతు కోసి చంపేశాడు, హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు
Image used for representational purpose only | (Photo Credits: PTI)

Hyderabad, Oct 19: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించావు..నన్ను పెళ్లి చేసుకో అన్నందుకు ఓ యువతిని ప్రియుడు తన సోదరుడితో కలిసి దారుణంగా హత్య (HYD Woman Murder) చేశాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ హైదరాబాద్‌ రెయిన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోని నాగల్‌గిద్ద మండలం కరస్‌గుత్తి ప్రాంతానికి చెందిన రాజ్‌ కుమార్‌ కుటుంబం కొన్నేళ్ల క్రితం బతుకు తెరువు కోసం నగరానికి వచ్చి ఆసిఫ్‌నగర్‌లోని దత్తాత్రేయనగర్‌లో నివాసముంటోంది. రాజ్‌ కుమార్‌ కూతురు రాధిక (24) మహాత్మాగాంధీ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ చదువుతోంది.

జంతు ప్రేమికురాలైన రాధిక గచ్చిబౌలిలోని పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ సంస్థలో జంతువులకు శిక్షణ ఇస్తోంది. ఈ సమయంలోనే పాతబస్తీ లోని మదీనానగర్‌ ప్రాంతానికి చెందిన ముస్తాఫాతో ప్రేమలో పడింది. అయితే గత 20 రోజుల నుంచి ప్రియుడు ముస్తఫా నుండి ఎటువంటి సమాచారం లేకపోవడంతో పెళ్లి చేసుకోవాలని అడిగేందుకు అతని ఇంటికి వెళ్లింది. ఈ సమయంలో రాధిక, ముస్తాఫా కుటుంబసభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రాధికను నమ్మించి ఇంట్లోకి తీసుకెళ్లాడు.

హైదరాబాద్‌లో బలవంతపు వ్యభిచారం, 12 మందిని అరెస్ట్ చేసిన ఎన్ఐఏ, నలుగురు బంగ్లాదేశ్ యువతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

అర్ధరాత్రి తన సోదరుడు సయ్యద్‌ జమీల్‌ వసే(24)తో కలసి కత్తితో గొంతు కోసి దారుణంగా హత్య (Hyderabad old city murder) చేశాడు. మీర్‌చౌక్‌ ఏసీపీ ఆనంద్, రెయిన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు, క్లూస్‌ టీమ్‌లు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించి, అనంతరం నారాయణ ఖేడ్‌కు పంపిచారు. మృతురాలు దళితురాలు కావడంతో పోలీసులు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

(The above story first appeared on LatestLY on Oct 19, 2020 01:00 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).