Image Used for Representational Purpose Only | (Photo Credits: File Image)

Warangal, july 28: ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు..పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. ఆ మాటలు నమ్మిన యువతి అతనికి సర్వస్వాన్ని అర్పించింది. కొన్ని నెలల పాటు సహజీవనం చేసింది. ఈ నేపథ్యంలో గర్భం దాల్చింది. పెళ్లి చేసుకోమని అడగగా అబార్షన్‌ చేయించి ముఖం చాటేశాబు ఓ ప్రబుద్ధుడు. మోసపోయానని తెలుసుకున్న బాధిత యువతి వరంగల్ జిల్లా వాజేడు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

యువతి కథనం ప్రకారం.. తెలంగాణలోని వరంగల్ జిల్లా వాజేడుకు చెందిన యువతి(24)ని ప్రేమిస్తున్నానని అదే మండలానికి చెందిన యువకుడు ఏడాది కాలంగా వెంటపడ్డాడు. ఆరు నెలల నుంచి యువతి ఇంటి వద్దే ఉంటూ సహజీవనం (cohabited in the belief that he would marry her) చేశాడు. దీంతో యువతి గర్భం దాల్చింది. ఈ విషయం అతడికి చెప్పడంతో తల్లిదండ్రులతో మాట్లాడి పెళ్లి చేసుకుంటాని చెప్పాడు. తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడించాడు. వారు తల్లిదండ్రులను తీసుకురావాలని చెప్పడంతో యువతి తల్లిదండ్రులు వెళ్లారు.

పెళ్లయి మూడేళ్లయినా శోభనం లేదు, తీరా చూస్తే భర్త స్వలింప సంపర్కుడు, విడాకులు కావాలని న్యాయస్థానంలో పోరాటం చేస్తున్న బాధిత భార్య, కర్ణాటకలో ఘటన

ఈ క్రమంలో రూ.5 లక్షల కట్నం ఇస్తేనే పెళ్లి చేస్తామని యువకుడి తల్లిదండ్రులు చెప్పడంతో యువతి తరుఫువారు కంగుతిన్నారు. తనకు ఇద్దరు కూతుర్లేనని, ఉన్న ఆస్తి మొత్తం వారికే చెందుతుందని చెప్పినా వినిపించుకోలేదు. యువతిని పుట్టింట్లో వదిలి వెళ్లిపోగా, పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది. ఆ తర్వాత అబార్షన్‌ చేయించుకుంటే పెళ్లి చేసుకుంటానని యువతిని నమ్మించి హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అబార్షన్‌కు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆస్పత్రి నిర్వాహకులు యువతి తరఫు వారు ఉంటేనే చేస్తామని చెప్పారు.

ఇదేం విచిత్రం, పెళ్లి కోసం హిజ్రాగా మారిన యువతి, తర్వాత పెళ్లికి నిరాకరించిన మరో యువతి, మోసపోయానంటూ పోలీసులను ఆశ్రయించిన బాధిత యువతి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కడప పోలీసులు

దీంతో యువకుడి తల్లి నేనే అమ్మాయికి తల్లినని నమ్మించి అబార్షన్‌ చేయించింది. అనంతరం యువతిని ఇంటి వద్ద దింపి ముఖం చాటేశారు. సర్పంచ్‌ సమక్షంలో పంచాయితీ నిర్వహించినా యువకుడు మాటవినలేదు. దీంతో సర్పంచ్‌ సూచన మేరకు యువతి జూలై 6న పోలీసులకు (young woman complained to police) ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. కాగా, తాను ఫిర్యాదు చేసినప్పటికీ ఇంత వరకు ఏ విధమైన చర్యలు తీసుకోలేదని సదరు ఫిర్యాదులో ఉన్న వ్యక్తులపై చట్ట పరంగా చర్యలను తీసుకుని న్యాయం చేయాలని డిమాండ్‌ చేసింది.