Mahbubnager, SEP 14: వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila), టీఆర్ఎస్ నేతల మధ్య మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరువురి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పాదయాత్రలో వైఎస్ షర్మిల (YS Sharmila) తమపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, ప్రజాప్రతినిధుల గౌరవాన్ని తగ్గించేలా మాట్లాడుతున్నారని కొందరు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు (TRS MLSs) అసెంబ్లీ స్పీకర్ కు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. షర్మిలపై చర్యలు తీసుకోవాలని వారు స్పీకర్ ను కోరారు. ఈ పరిణామం తర్వాత.. తగ్గేదేలే అన్నట్టుగా.. షర్మిల మరింత దూకుడు పెంచారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై విరుచుకుపడ్డారు. పాలమూరు నీళ్ల పోరు నిరాహార దీక్ష వేదికగా మంత్రి నిరంజన్ రెడ్డికి (Niranjan reddy) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వైఎస్ షర్మిల. తనను మంగళవారం మరదలు అన్న వ్యాఖ్యలపై షర్మిల సీరియస్ అయ్యారు. మరోసారి పిచ్చికూతలు కూస్తే చెప్పుతో సమాధానం చెప్తానన్నారు. వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డికి.. రైతులపై ప్రేమ లేదన్న షర్మిల.. ఒకవేళ నిజంగా ప్రేమే ఉంటే.. తనతో పాటు దీక్షలో కూర్చోవాలని సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ ను స్వీకరించాలన్నారు షర్మిల. ”మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు రాజశేఖర్ రెడ్డి బిడ్డ. మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి. మీకు చేతనైనది చేసుకోండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డ భయపడేది కాదు. మరొక్కసారి పిచ్చి పిచ్చి కూతలు కూశారు అంటే.. ఈసారి చెప్పుతోనే సమాధానం చెప్తాం. జాగ్రత్త..” అంటూ మంత్రి నిరంజన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు షర్మిల.
మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతి, అక్రమాలను ప్రజల తరఫున ప్రశ్నిస్తే.. అది మీకు తిట్టినట్లు అయిందా? అలా అనిపిస్తే బూతు పురాణంలో ఆరితేరిన కేసీఆర్ పై, మంత్రి నిరంజన్ రెడ్డిపై, మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి.ఆ తర్వాతే రాజన్న బిడ్డను ముట్టుకోవాలి.#PrajaPrasthanam #PalamuruNeellaPoru pic.twitter.com/bVleAa0OOw
— YS Sharmila (@realyssharmila) September 14, 2022
మీ తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదంటూ షర్మిల పరోక్షంగా టీఆర్ఎస్ నేతలకు తేల్చి చెప్పారు. రాజన్న బిడ్డ ఇలాంటి వాటికి భయపడదని కామెంట్ చేశారు. అంతేకాదు మరోసారి పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే చెప్పుతో సమాధానం చెబుతానని ఘాటుగా అన్నారు. ఇదిలా ఉంటే వైఎస్ షర్మిలపై అసెంబ్లీ స్పీకర్‌కు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలపై షర్మిల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, దాస్యం వినయ్ భాస్కర్, లక్ష్మారెడ్డి, కాలే యాదయ్య స్పీకర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధులు అనే విషయాన్ని మరిచి ప్రజాస్వామ్య వ్యవస్థను అపహాస్యం చేసే విధంగా షర్మిల తీరుందని తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ప్రజలెన్నుకున్న ప్రజాప్రతినిధుల హక్కులకు, గౌరవానికి భంగం కలిగించేలా.. నిరాధార ఆరోపణలు, జుగుప్సాకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో ప్రస్తావించారు. షర్మిలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ను కోరారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తామని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వారితో చెప్పారు. ఈ అంశాన్ని ప్రివిలేజ్ కమిటీకి సిఫారసు చేయనున్నారని సమాచారం.
టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు తనపై స్పీకర్ కు ఫిర్యాదు చేసిన అంశంపై ట్విట్టర్ వేదికగా స్పందించారు షర్మిల. తనపై చర్యలకు ఆలోచించే ముందు పరాయి ఆడదాన్ని, ఒక తల్లిని.. మరదలంటూ తనతో పాటు తన తోటి మహిళలను కించపరిచిన సంస్కారహీనుడైన మంత్రి నిరంజన్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారామె. నిరుద్యోగుల కోసం తాను చేసిన దీక్షలను వ్రతాలంటూ కామెంట్ చేసిన కేటీఆర్‌పైనా చర్యలు తీసుకోవాలన్నారు.