ఎయిర్ ఇండియా తన ప్రయాణికులకు కొత్త ఫెసిలిటీ తీసుకొచ్చింది. తమ విమానాల్లో ప్రయాణించే వారు తమకు వీలైనప్పుడు టికెట్ బుక్ చేసుకునేందుకు వీలుగా రెండు రోజుల పాటు టికెట్ల ధరలు లాక్ చేసుకునే ఫేర్ లాక్ సౌకర్యం కల్పించింది. అయితే, ప్రయాణికులు ఈ ఫీచర్ కోసం కొంత మొత్తం చెల్లించాలి. ఇలా టికెట్ ధర లాక్ చేయడం వల్ల ప్రయాణికులు టికెట్ ధర మారకుండా తమ ప్రయాణాన్ని రెండు రోజుల తర్వాత కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ప్రయాణానికి కనీసం 10 రోజుల ముందు ఈ సౌకర్యం వాడుకోవచ్చునని వివరించింది. ఎక్స్‌లో పోర్న్ వీడియోలకు అనుమతిచ్చిన ఎలాన్ మస్క్, కొత్త పాలసీ అప్‌డేట్ ప్రకటించిన టెస్లా అధినేత
విమాన ప్రయాణికులు.. ఎయిర్ ఇండియా తీసుకొచ్చిన ‘ఫేర్ లాక్’ ఫెసిలిటీ వాడుకునేందుకు ముందు కొంత నాన్ రీఫండబుల్ ఫీజు పే చేసి ఎయిర్ ఇండియా వెబ్ సైట్ లో గానీ, మొబైల్ యాప్ లో గానీ మేనేజ్ బుకింగ్స్ ఆప్షన్లతో మిగతా ప్రక్రియ పూర్తి చేయవచ్చు. దేశీయ విమాన సర్వీసుల్లో ప్రయాణించే వారు రూ.500, తక్కువ దూరం విదేశీ ప్రయాణానికి రూ.850, సుదూర అంతర్జాతీయ ప్రయాణానికి రూ.1500 నాన్ రీఫండ్ ఫీజు చెల్లించి టికెట్ ధర లాక్ చేసుకోవచ్చు. ఏ కారణంతోనైనా టికెట్ బుక్ చేసుకోకుంటే మాత్రం ఆ మొత్తం మనీ తిరిగి రాదు.