Air India (photo-Wikimedia Commons)

ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ త్వరలో ఒకటి కాబోతున్నాయి. ఈ రెండు విమానయాన సంస్థల విలీనం నేపథ్యంలో వందలాది మంది ఉద్యోగాలు ఇంటికి వెళ్లనున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ రెండింటిలో కనీసం 600 మంది ఉద్యోగులను తొలగించబోతున్నారని సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ నాటికి దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఆగని లేఆప్స్, మరోసారి 250 మంది ఉద్యోగులను తొలగించిన ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ అన్‌అకాడమీ

అయితే రిటైర్‌మెంట్‌కు చేరుకుంటున్న ఉద్యోగులు, నిర్ణీత కాల ఒప్పందాలు ఉన్న ఉద్యోగులు ఇందులో ఉండరని తెలుస్తోంది. హెచ్‌టీ లైవ్ నివేదిక ప్రకారం.. సుమారు 18,000 మంది ఉద్యోగులున్న ఎయిర్ ఇండియా విస్తారాతో విలీనం కానుంది. ఇందుకోసం దాదాపు 6000 మంది విస్తారా ఉద్యోగులను విలీన యూనిట్‌లో చేయాల్సి ఉంటుంది."నాన్-ఫ్లైయింగ్ ఫంక్షన్‌లలోని ఉద్యోగులకు సంస్థాగత అవసరాలు, వ్యక్తిగత యోగ్యత ఆధారంగా ఉద్యోగాల కేటాయింపు ఉంటుంది" అని సమాచారం.