Bharti Airtel. (Photo Credits: Twitter)

టెలికం దిగ్గజం ఎయిర్‌టెల్ ఊహించని ప్లాన్‌ను ప్రకటించింది. కేవలం రూ.9 తో ప్రత్యేక డేటా ఆఫర్‌ను ఆవిష్కరించింది. ఈ ప్లాన్‌లో ఏకంగా 10 జీబీ డేటా లభిస్తుంది. అయితే ప్లాన్ వ్యాలిడిటీ కేవలం 1 గంటలోనే ముగిసిపోతుంది. ఈ ప్లాన్ ఎఫ్‌యూపీ (ఫెయిర్ యూసేజ్ పాలసీ) పరిమితి 10జీబీగా ఉందని, ఆ తర్వాత స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గిపోతుందని ఎయిర్‌టెల్ వివరించింది. కాబట్టి యూజర్లు ఎంత డేటా వినియోగించుకోవాలనుకున్నా గంట వ్యవధిలోనే వాడుకోవాల్సి ఉంటుంది. ఎయిర్‌టెల్ నుంచి నయా ప్లాన్, రూ.279 రీఛార్జ్‌తో 45 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 2 జీబీ డేటా..

కాగా పెద్ద ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకునే యూజర్లకు ఈ ప్లాన్ బాగా ఉపయోగపడనుంది. తాత్కాలిక డేటా బూస్ట్ అవసరమైనవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణంగా టెలికం కంపెనీల ప్లాన్లు పరిశీలిస్తే 10జీబీ అదనపు డేటా కావాలనుకుంటే దాదాపు రూ.100 వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో రూ.9 రీఛార్జ్ చాలా  ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా రూ.9తో 10 జీబీ లభిస్తుండగా.. రూ.18 రీఛార్జ్‌తో యూజర్లు 20జీబీ డేటాను పొందవచ్చు. ఎయిర్‌టెల్ వెబ్‌సైట్‌తో పాటు మొబైల్ యాప్‌లో ఈ ప్లాన్ ప్రస్తుతం యూజర్లకు అందుబాటులో ఉంది.