Bharti Airtel: ఎయిర్‌టెల్‌ యూజర్లకు భారీ షాక్, పెరగనున్న టారిఫ్ ధరలు, ఏఆర్‌పీయూ రూ.200 మార్కును దాటగలదని తెలిపిన దక్షిణాసియా ఎండీ గోపాల్‌ విఠల్‌
Airtel prepaid users to get Rs 4 lakh life cover under Rs 599 plan (Photo-File image)

ఎయిర్‌టెల్‌ యూజర్లకు కంపెనీ నుంచి భారీ షాక్‌ తగలనుంది. ఇప్పటికే గతేడాది టారిఫ్‌ రేట్లను పెంచిన ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) సంస్థ ఈ ఏడాది మరోసారి టారిఫ్‌ రేట్లను పెంచనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో..ఈ ఏడాది తదుపరి విడత టారిఫ్‌ల పెంపుతో తమ ఏఆర్‌పీయూ (యూజరుపై వచ్చే సగటు ఆదాయం) రూ.200 మార్కును దాటగలదని టెలికం సంస్థ భారతి ఎయిర్‌టెల్‌ ఇండియా, దక్షిణాసియా ఎండీ గోపాల్‌ విఠల్‌ (managing director Gopal Vittal) తెలిపారు.

5G ఎయిర్‌వేవ్‌ల కోసం టెలికాం రెగ్యులేటర్ సిఫార్సు చేసిన బేస్ ధరలపై భారతి ఎయిర్‌టెల్ నిరాశ చెందిందని, పరిశ్రమ రాని పెద్ద తగ్గింపును ఆశించిందని మేనేజింగ్ డైరెక్టర్ గోపాల్ విట్టల్ తెలిపారు. ఎయిర్‌టెల్ NSE -3.15% క్యాలెండర్ 2022లో మరో టారిఫ్ పెంపునకు దారితీసే అవకాశం ఉందని, ఇది వినియోగదారుడిపై సగటు ఆదాయాన్ని (ARPU) రూ. 200కి పెంచే అవకాశం ఉందని, మార్కెట్ మరో పెంపును "సులభంగా గ్రహించడానికి" సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు.

వాట్సాప్ నుంచి సూపర్ ఫీచర్, గ్రూపులో నుంచి ఎవరికీ తెలియకుండా లెఫ్ట్ అయిపోవచ్చు, గ్రూపు అడ్మిన్ల‌కే మాత్రమే ఆ విషయం తెలుస్తుంది

అయిదేళ్లలో దీన్ని రూ.300కు పెంచుకునే అవకాశం ఉందని ఇన్వెస్టర్లతో కాన్ఫరెన్స్‌ కాల్‌లో ఆయన చెప్పారు. గతేడాది మార్చి త్రైమాసికంలో నమోదైన రూ.145తో పోలిస్తే ఈ మార్చి క్వార్టర్‌లో ఎయిర్‌టెల్‌ ఏఆర్‌పీయూ రూ.178కి పెరిగింది. టెలికం సంస్థలు గత రెండేళ్లుగా మొబైల్‌ కాల్స్, డేటాల ధరలను పెంచుతున్నాయి. ప్రైవేట్‌ రంగంలోని మూడు సంస్థలు గతేడాది నవంబర్‌–డిసెంబర్‌లో మొబైల్‌ ప్లాన్ల రేట్లను 18–25 శాతం మేర పెంచాయి. మరోవైపు, చిప్‌ల కొరతతో స్మార్ట్‌ఫోన్ల రేట్లు పెరిగి విక్రయాలపై ప్రభావం పడిందని విఠల్‌ చెప్పారు. ఇది తాత్కాలిక ధోరణే కాగలదని ఎండీ గోపాల్‌ విఠల్‌ పేర్కొన్నారు.