ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన వీడియో స్ట్రీమింగ్ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తృతం చేసే దిశలో మరో ముందడుగు వేసింది. ఇందులో భాగంగా దేశీయ ఫ్రీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఎంఎక్స్ ప్లేయర్‌ను (MX player) కొనుగోలు చేసినట్లు వెల్లడించింది. దీన్ని తమ ప్రకటనలతో కూడిన ఓటీటీ సేవలందించి స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ మినీటీవీలో (Amazon miniTV) విలీనం చేసిగా తీసుకొచ్చినట్లు వెల్లడించింది.
అయితే ఎంతకు కొనుగోలు చేశారనే వివరాలను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఎంఎక్స్ ప్లేయర్ సేవలను యాప్, అమెజాన్.ఇన్ షాపింగ్ యాప్, ప్రైమ్ వీడియో, ఫైర్ టీవీ కనెక్ట్‌డ్ టీవీల్లో వీక్షించొచ్చని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ఎంఎక్స్ ప్లేయర్ విలీనం ఆటోమేటిక్‌గా జరిగిపోతుందని, ఇందుకోసం యాప్‌ని రీ ఇన్‌స్టాల్ గానీ, అప్‌గ్రేడ్ గానీ చేయాల్సిన అవసరం ఏమీ లేదని పేర్కొంది. మున్ముందూ ఎంఎక్స్‌ప్లేయర్ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని తెలిపింది. అమెజాన్‌కు ఇది వరకే సబ్‌స్క్రిప్షన్ ఆధారిత ఓటీటీ ప్లాట్‌ఫామ్ ప్రైమ్‌వీడియో (Prime video) ఉన్న విషయం తెలిసిందే.