ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఆపిల్ కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది చివర్లో ఐఫోన్-14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను (iPhone 14 launch this fall) ఆపిల్ లాంచ్ చేయనుంది. ఈ నేపథ్యంలో 2019 సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్ల పూర్తిగా నిలిపివేయనున్నట్లు ఆపిల్ ఒక ప్రకటనలో వెల్లడించింది. iDropNews నివేదిక ప్రకారం...ఐఫోన్-11 స్మార్ట్‌ఫోన్ (iPhone 11) ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన ఐఫోన్ ఎస్‌ఈ 3తో నేరుగా పోటీపడటంతో...ఈ సంవత్సరం నుంచి దశలవారీగా ఐఫోన్ 11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్ సిద్దమైన్నట్లు తెలుస్తోంది. మిస్టరీ ఫోటోను షేర్ చేసిన నాసా, అవి ఏలియన్ల పాదాలే అంటున్న నెటిజన్లు, సోషల్ మీడియాలో ఊపందుకున్న చర్చ
భారత్‌లో ఐఫోన్-11, ఐఫోన్ ఎస్‌ఈ 3 స్మార్ట్‌ఫోన్ల ధరలు కూడా సరిసమానంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఐఫోన్-11 సిరీస్ స్మార్ట్‌ఫోన్లను నిలిపివేసేందుకు యాపిల్ సన్నాహాలను చేస్తోంది. ఇదిలా ఉండగా ఐఫోన్-12 ధరలు కూడా తగ్గే అవకాశం ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో ఐఫోన్-12 సిరీస్ స్మార్ట్‌ఫోన్ ధరలు ఐఫోన్-11 ధరలతో సమానంగా ఉండే ఆస్కారం ఉందని ఐడ్రాప్ న్యూస్ తన నివేదికలో పేర్కొంది.