BSNL all set to launch its 5G services soon(X)

Hyd, Aug 1:  ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో వినియోగదారులకు తక్కువ ధరలోనే 5జీ సేవలను అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి ... బీఎస్‌ఎన్‌ఎల్‌తో దేశీయ టెలికాం స్టార్టప్ కంపెనీ చర్చలు జరుపుతోంది.

త్వరలో 5జీ సర్వీసులకు సంబంధించి ట్రయల్ సర్వీస్‌ను ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్ట్ కింద బీఎస్‌ఎన్‌ఎల్‌ హోల్డింగ్ 700MHz బ్యాండ్‌ను మొదట ఉపయోగించబడుతుంది. ఈ ట్రయల్ రన్ తొలుత ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో నిర్వహించనున్నారు. అనంతరం క్రమక్రమంగా దేశవ్యాప్తంగా విస్తరించనున్నారు.

ప్రస్తుతం దేశంలో జియో, ఎయిర్‌టెల్‌ 5జీ నెట్‌వర్క్‌ను అందిస్తున్నాయి. అయితే వీటి రీఛార్జ్‌లు చాలా ఎక్కువగా ఉండటంతో వినియోగదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.  ఓలా నుంచి త్వరలో తొలి ఎలక్ట్రిక్ మోటారు సైకిల్, వచ్చే ఏడాది మార్కెట్లోకి తీసుకువస్తామని తెలిపిన సీఈఓ భవిష్ అగర్వాల్ 

ఈ నేపథ్యంలోనే ప్రజలకు తక్కువ ధరలో 5జీ సర్వీసులను అందించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ ముందుకు వచ్చింది. బీఎస్‌ఎన్ఎల్‌ సర్వీసులు అందుబాటులోకి వస్తే హై స్పీడ్ డేటా, కాలింగ్ సౌకర్యాన్ని పొందవచ్చని భావిస్తున్నారు.