ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) సరికొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్లను ( BSNL postpaid plans) కస్టమర్లకు పరిచయం చేసింది. ఇటీవల కొత్త బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్ తాజాగా డేటా రోల్‌ఓవర్ సదుపాయంతో పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాల్స్, రోజువారీ 100 ఉచిత ఎస్‌ఎంఎస్‌లందించే కొత్త పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లను (BSNL New Plans) ప్రకటించింది. డిసెంబర్ 1, 2020 నుంచి దేశవ్యాప్తంగా వీటిని లాంచ్ చేయనున్నామని తెలిపింది.
రూ.199 రూ .798, 999 రూపాయల ధరలో మూడు కొత్త ప్లాన్‌లను బీఎస్‌ఎన్‌ఎల్ తీసుకురాబోతోంది. ఈ ప్లాన్లలో అపరిమిత కాలింగ్, డేటా, డేటా రోల్ ఓవర్, ఫ్యామిలీ యాడ్-ఆన్ లాంటి ప్రయోజనాలు అందించనుంది ఈ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లతో పాటు, బీఎస్‌ఎన్‌ఎల్ రెండు యాడ్-ఆన్ ప్లాన్లను రూ .150 రూ.250 లకు తీసుకొస్తోంది. ఇవి వరుసగా 40 జీబీ డేటా, 70 జీబీ డేటాను ఆఫర్ చేయనున్నాయి.
రూ 199 పోస్ట్‌పెయిడ్ ప్లాన్:
300 నిమిషాల ఉచిత ఆఫ్-నెట్ కాల్‌లతో అపరిమిత ఆన్-నెట్ వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ 75 జీబీ వరకు రోల్‌ఓవర్ ప్రయోజనాలతో 25 జీబీ డేటాను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్ కూడా ఇస్తుంది. యాడ్ ఆన్ ఫ్యామిలీ సదుపాయం లేదు.
రూ .798 పోస్ట్‌పెయిడ్ ప్లాన్:
భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్ సదుపాయం.150 జీబీ వరకు రోల్‌ఓవర్ ప్రయోజనాలతో 50 జీబీ డేటాను కూడా ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్ సదుపాయం.అలాగే ఇద్దరుకుటుంబ సభ్యులకు ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా ఇస్తుంది. ఈ యాడ్-ఆన్‌లో అపరిమిత వాయిస్ సౌకర్యం, 50 జీబీ డేటా , రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితం.
రూ .999 పోస్ట్‌పెయిడ్ ప్లాన్:
భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఈ ప్లాన్ రోల్‌ఓవర్ ప్రయోజనాలతో 75 జీబీ డేటాను 225 జీబీ వరకు ఇస్తుంది. ఈ ప్లాన్ 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు, 3 ఫ్యామిలీ యాడ్-ఆన్ కనెక్షన్లను కూడా ఇస్తుంది. ఇందులో రోజుకు అపరిమిత వాయిస్ సౌకర్యం, 75 జీబీ డేటా, 100 ఎస్ఎంఎస్‌లు లభ్యం.