వివిధ కంపెనీలు మొబైల్ టారిఫ్‌లు పెంచిన నేపథ్యంలో ప్రభుత్వరంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ పెంపుపై స్పష్టతనిచ్చింది. సమీప భవిష్యత్తులో టారిఫ్‌లు పెంచబోమని కీలక ప్రకటన చేసింది. ఇప్పటికే జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా తదితర ప్రైవేటు ఆపరేటర్లు ఇటీవల టారిఫ్‌ను పెంచాయి.
ఈ క్రమంలో ప్రభుత్వరంగ నెట్ వర్క్ టారిఫ్ పెంపుపై పైవిధంగా ప్రకటన చేసింది. సమీప భవిష్యత్తులో టారిఫ్ పెంపు ఉండదని బీఎస్ఎన్ఎల్ చైర్మన్, ఎండీ రాబర్ట్ రవి స్పష్టం చేశారు. వినియోగదారుల సంతోషం, వారి విశ్వాసాన్ని గెలుచుకోవడం తమకు ప్రధాన లక్ష్యమన్నారు. ఈ క్రమంలో సమీప భవిష్యత్తులో పెంపు ఉండదన్నారు.