Chingari App: టిక్‌టాక్‌కు ధీటుగా చింగారి యాప్, 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్న మేడ్ ఇన్ ఇండియా యాప్ గురించి తెలుసుకోండి
Chingari Made-in-India app Chingari, Desi Alternative to TikTok (Photo-Twitter)

New Delhi, June 30: చైనీస్ యాప్ టిక్‌టాక్ తో పాటు 59 చైనీస్ యాప్‌లను ప్రభుత్వం నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ఇండియా యాప్ చింగారి (Chingari Made in India app) వచ్చేసింది. ఈ యాప్ ను గంటలోనే ఈ యాప్‌ను ( Chingari APP) పదిల‌క్ష‌లమంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్న‌ారు. షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ ( TikTok) మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్ర‌స్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం సంచలన నిర్ణయం, టిక్‌టాక్ సహా మొత్తం 59 చైనీస్ యాప్‌లపై నిషేధం, రేపు జాతినుద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ

దీంతో స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపొందింన 'చింగారి' యాప్‌ను ప్రోత్స‌హించాలంటూ ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. పారిశ్రామికవేత్త ఆనంద్ మ‌హింద్రా సైతం చింగారి యాప్‌ను డౌన్‌లోడ్ చేసి దాని ప్ర‌త్యేక ఫీచ‌ర్స్‌ను వివ‌రించారు. స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపుదిద్దుకున్న చింగారి యాప్ రూప‌క‌ర్త‌ల‌పై ప్ర‌శంస‌లు కురిపిస్తూ ట్వీట్ చేశారు. మ‌రో విశేషం ఏంటంటే ఆనంద్ మ‌హింద్రా ఇప్ప‌టివ‌ర‌కు టిక్‌టాక్ యాప్‌ను మునుపెన్న‌డూ డౌన్‌లోడ్ చేసుకోలేదు.

Here's anand mahindra Tweet

బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్‌, సిద్ధార్థ్ గౌతమ్ గ‌తేడాది చింగారి యాప్‌ను రూపొందించారు. అయితే అది అంతగా ఆదరణకు నోచుకోలేదు. తాజాగా 59 చైనా యాప్‌ల‌పై ప్ర‌భుత్వం నిషేదం విధించ‌డంతో చింగారి యాప్ డౌన్‌లోడ్స్ పెరిగాయి. ఇప్ప‌టికే 1 మిలియ‌న్ మార్కును దాటేసి గూగుల్ ప్లే స్టోర్‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది. అంతేకాకుండా ప‌లు సామాజిక ప్లాట్‌ఫామ్‌లు సైతం చింగారిలో పెట్టుబుడులు పెట్టేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారని ప్రోగ్రామ‌ర్ నాయ‌క్ తెలిపారు.

59 చైనీస్ యాప్‌ల‌పై నిషేధం విధిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని చింగారి యాప్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు సుమిత్ ఘోష్ స్వాగతించారు. డేటా త‌స్క‌రించి గూఢ‌చార్యానికి పాల్ప‌డ్డ యాప్‌ను భార‌త్ తిరిగి త‌న గూటికి చేర్చింది. ఎట్ట‌కేల‌కు ఈ బ్యాన్ జరిగినందుకు మ‌కు సంతోషంగా ఉంద‌న్నారు. కాగా టిక్ టాక్ ఈ యాప్‌ను భార‌త్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు.ఇదిలా ఉంటే చైనా యాప్‌ టిక్‌టాక్‌ను గూగుల్‌ ప్లేస్టోర్, యాపిల్‌ యాప్‌ స్టోర్‌‌ నుంచి తొలగించాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గూగుల్‌, యాపిల్‌ మంగళవారం ఈ నిర్ణయం తీసుకున్నాయి.

చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59 యాప్ లను నిషేధిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో టిక్‌టాక్ మంగళవారం స్పందించింది. తన వినియోగదారుల డేటాను చైనా సహా ఏ విదేశీ ప్రభుత్వానికి ఇవ్వలేదని, భవిష్యత్తులో కూడా అలా చేయబోమని వివరణ ఇచ్చింది. భారత చట్టాల ప్రకారం, డేటా ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలన్నీ పాటిస్తున్నామంటూ టిక్‌టాక్ ఇండియా హెడ్ నిఖిల్ గాంధీ ఒక ప్రకటన విడుదల చేశారు.

ఈ అంశంపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి తమకు ఆహ్వానం అందిందని చెప్పారు. దీనిపై మరింత స్పష్టత ఇచ్చేందుకు, చర్చించడంతోపాటు, సందేహాలను నివృత్తి చేస్తామన్నారు. వినియోగదారు గోప్యతకు, సమగ్రతకే అధిక ప్రాముఖ్యత అన్నారు.