New Delhi, May 26: త్వరలో భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం బలహీనపడుతుందని (Earth's Magnetic Field Weakening) శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తద్వారా మొబైల్ ఫోన్లు (mobile phones), శాటిలైట్‌లు ( spacecraft) ఆగిపోవచ్చని శాస్త్రవేత్తలు (Scientists) అంచనా వేస్తున్నారు. భూమి చుట్టూ ఉండే అయస్కాంత క్షేత్రం సూర్యుడి నుంచి వచ్చే భయంకరమైన అతినీలలోహిత కిరణాల నుంచి కాపాడటమే కాకుండా మన మొబైల్ సిగ్నల్, శాటిలైట్ సిగ్నల్స్ అందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తోందనే విషయం విదితమే. హైడ్రాక్సీక్లోరోక్వీన్ ట్రయల్స్ ఆపేయండి, ఈ డ్రగ్ తీసుకుంటే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉందని తెలిపిన డబ్ల్యూహెచ్‌వో
అయితే ఇప్పుడు అందులో కొంత భాగం బలహీన పడిపోయిందని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. ఇలా ఎందుకు జరుగుతోంది అన్న విషయం మాత్రం ఎవరికి అంతుచిక్కడం లేదు. శాటిలైట్ల డేటా ఆధారంగా ఆఫ్రికా, దక్షిణ అమెరికా మధ్య ఈ బలహీనత ఏర్పడిందని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. సౌత్ అట్లాంటిక్ ఎనామలీ అని పిలిచే ప్రాంతం కొన్నేళ్లుగా విస్తరిస్తూ ఉందంట. అయస్కాంత క్షేత్రాల బలహీనత రానూరానూ ఎక్కువ ప్రాంతాలకు విస్తరించడం ద్వారా పెను ముప్పు తప్పదని వారు చెబుతున్నారు. హెచ్ఐవీ మాదిరిగానే కోవిడ్ 19 మనతో ఉంటుంది, కలిసి జీవించడం నేర్చుకోవాలి, దేశాలన్నీ జాగ్రత్తగా వ్యవహరించాలి, హెచ్చరించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
ఇంతకుముందు 24000 నానాటెస్లాస్ ఉండే అయస్కాంత క్షేత్ర బలం కాస్త ఇప్పుడు 22000 నానోటెస్లాస్‌కి చేరిందని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ఈఎస్‌ఏ) సైంటిస్టులు చెప్పారు. ఈ ఎనామలీ ఏరియా... ఏటా 20 కిలోమీటర్లు అదనంగా పడమర వైపు విస్తరిస్తోందని తెలిపారు. తాజాగా... నైరుతీ ఆఫ్రికాలో మరో కొత్త ఎనామలీ మొదలైనట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఒకే ఎనామలీ రెండుగా ముక్కలైందని వారు భావిస్తున్నారు.
దీనికి సంబంధించి ఈఎస్‌ఏ శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. భూమిలో ఉత్తర, దక్షిణ ధ్రువాల అయస్కాంత క్షేత్రం తలకిందులుగా అవ్వడమే అయస్కాంత క్షేత్రం బలహీనంగా అవ్వడానికి కారణమన్నారు. ఉత్తర ధ్రువంలో ఉండే అయస్కాంత క్షేత్రం దక్షిణ ధ్రువానికీ, దక్షిణ ధ్రువంలో ఉండే అయస్కాంత క్షేత్రం ఉత్తర ధ్రువానికీ చేరుతోందని, ఇలా ప్రతి 250000 సంవత్సరాలకు ఓసారి జరుగుతుంది అని ఆయన తెలిపారు.
ఇదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా శాటిలైట్ల కమ్యూనికేషన్ కొంతవరకూ దెబ్బతినే అవకాశం ఉందని, టెలికం నెట్‌వర్కులు, మొబైల్ ఫోన్లు కూడా ప్రపంచవ్యాప్తంగా కొంతవరకూ పనిచేయకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు. దీంతో పాటు ఈ రెండు ఎనామలీలు ఉన్న ప్రాంతాల్లో వెళ్లే విమానాలు సరిగా పనిచేయకపోవచ్చని కూడా పరిశోధకలు చెబుతున్నారు.
అయితే మరోవైపు వేరే రకమైన వాదన కూడా వినిపిస్తోంది. ప్రస్తుతానికి శాటిలైట్లు, మొబైళ్లకు ఏ సమస్య రాలేదు కాబట్టి, ఇకపై కూడా రాకపోవచ్చనే అంచనా వేస్తోన్నారు. అయస్కాంత క్షేత్రం తలకిందులు అవ్వడం అనేది ఒక్క రోజులో జరగదు, కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు అంటున్నారు.