Musk (Credits: ANI)

New York, July 16: మైక్రోబ్లాగింగ్ సైట్, సోషల్ మీడియా వేదిక ట్విట్టర్ అధినేత ఎలన్ మస్క్ (Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. సంస్థ నగదు కొరత సమస్యనెదుర్కొంటుందని ఆదివారం అంగీకరించారు. ఇప్పటికీ ట్విట్టర్’కు క్యాష్ ఫ్లో నెగెటివ్‌గా (Cash Flow Still Negative) ఉందన్నారు. ట్విట్టర్‌కు భారీగా రుణాలు ఉండటంతోపాటు వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే రెవెన్యూ సగానికి పడిపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ (Twitter) వేదికగా ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఎలన్ మస్క్ సమాధానం ఇస్తూ.. ‘ట్విట్టర్ ముందుగా నిల్వలు ఏర్పాటు చేసుకునే స్థాయికి చేరుకోవాలి` అని అన్నారు. అయినా ప్రతి రోజూ వెరిఫైడ్ అకౌంట్స్ ట్వీట్లు 50 శాతం పెరుగుతున్నాయని విడిగా ప్రకటించారు. తిరిగి అడ్వర్టైజ్‌మెంట్లు రాబట్టగలిగితే క్యాష్ ఫ్లో పాజిటివ్‌గా మారుతుందన్నారు.

Twitter Now Paying Users: మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? ట్వీట్లు చేస్తూ వేలకు వేలు సంపాదించవచ్చు, ఏయే అర్హతలు కావాలంటే? 

యాడ్స్ ఆదాయంలో 50 శాతం తగ్గడంతో ట్విట్టర్ (Twitter) ఇంకా నగదు లోటులోనే ఉందని ఎలన్ మస్క్ చెప్పారు. దీనికి తోడు రుణ భారం చాలా ఎక్కువగా ఉందన్నారు. లోటు నిల్వల స్థాయి నుంచి ట్విట్టర్ మిగులు నిధుల స్థాయికి చేరుకోవడం చాలా ముఖ్యం అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది ట్విట్టర్‌కు 450 కోట్ల డాలర్ల ఆదాయం వస్తుందని అంచనా వేసినా.. తర్వాత 300 కోట్లకు తగ్గించారు. 2021లో 510 కోట్ల డాలర్లతో పోలిస్తే చాలా తక్కువ.

Aadhaar-PAN Link: 10 కోట్ల మంది ఎన్నారైల పాన్‌ కార్డులు డియాక్టివేట్, ఆదాయ పన్ను శాఖ స్పందన ఇదిగో.. 

ట్విట్టర్‌ను ఎలన్ మస్క్ టేకోవర్ చేసినప్పటి నుంచి దాన్ని ఒక ప్రయోగ శాలగా మార్చివేశారు. ఆయన చేపట్టిన వ్యయ నియంత్రణ, పొదుపు చర్యలేవీ ఫలితాలిచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. భారీగా ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.. అయినా మస్క్ ఆశించిన మేరకు ట్విట్టర్ ఆదాయం పెంచుకోలేకపోయింది.

ఇదిలా ఉంటే ట్విట్టర్ యూజర్లకు రోజుకొక రూల్ తీసుకొస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తున్నారు. బ్లూ టిక్, సబ్‌స్క్రిప్షన్ నిబంధనలు తెచ్చి ఎక్కువ మంది యూజర్లు వెరిఫైడ్ అకౌంట్లు తీసుకునేలా చేశాడు. యూజర్లు తమ ట్వీట్లు చూసేందుకు పరిమితి విధించడంతో నెటిజన్లు అసంతృప్తికి గుర‌వుతున్నారు. దీనికి తోడు ట్విట్టర్‌కు పోటీగా మెటా.. త‌న ఇన్‌స్టాగ్రామ్ అనుబంధ సంస్థగా ‘థ్రెడ్స్’ అనే యాప్ తీసుకొచ్చింది. మార్కెట్లోకి తెచ్చిన కొన్ని రోజుల్లోనే 10 కోట్ల మంది యూజర్లు ‘థ్రెడ్స్’ ఖాతాలో చేరారు.