Twitter Now Paying Users: మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? ట్వీట్లు చేస్తూ వేలకు వేలు సంపాదించవచ్చు, ఏయే అర్హతలు కావాలంటే?
Elon Musk and Twitter. (Photo credits Wikimedia Commons/ Twitter)

London, July 14: మీకు ట్విట్టర్ అకౌంట్ ఉందా? మస్క్ మామ యాజమాన్యంలోని ట్విట్టర్ తమ క్రియేటర్లకు డబ్బులు చెల్లిస్తోంది. ఇటీవలే ట్విట్టర్ క్రియేటర్ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌ను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ ప్రొగ్రామ్‌కు ఎలా అర్హత పొందాలి. మీరు ఎంత డబ్బు సంపాదించవచ్చు. ఇందులో పాల్గొనడానికి ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. ట్విట్టర్ క్రియేటర్ మానిటైజేషన్ ప్రోగ్రామ్‌‌లో భాగంగా వినియోగదారులు ఇప్పుడు తమ ట్వీట్‌లకు రీట్వీట్ల ద్వారా వచ్చే ప్రకటనల రాబడిలో భాగస్వామ్యం (Creator Ads Revenue Sharing) చేసుకునే అవకాశాన్ని పొందవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్ ద్వారా నేరుగా యూజర్లు జీవనోపాధిని పొందేందుకు వీలుగా ఈ చర్య తీసుకున్నట్లు ట్విట్టర్ తెలిపింది. యాడ్ రెవిన్యూ షేరింగ్, క్రియేటర్ల సభ్యత్వాలు (Creator Subscriptions) రెండింటికీ స్వతంత్రంగా సైన్ అప్ చేసేందుకు క్రియేటర్లకు అవకాశం కల్పిస్తుంది. ట్విట్టర్ యూజర్లు దీనికి ఎలా అర్హత పొందాలి? ఎంతవరకు డబ్బు సంపాదించవచ్చు? ఇందులో పాల్గొనడానికి అసలు ఏమి చేయాలి? అనే పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..

Threads App Launched: ట్విట్టర్‌కు పోటీగా మెటా థ్రెడ్స్ యాప్ లాంచ్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను వినియోగించి లాగిన్‌, ఐదు నిమిషాల పోస్ట్ చేయవచ్చు 

క్రియేటర్ యాడ్స్ రెవిన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనడానికి, యూజర్లు తప్పనిసరిగా ట్విట్టర్ బ్లూకు సభ్యత్వాన్ని పొందాలి లేదా వెరిఫికేషన్ పొందిన సంస్థలుగా గుర్తింపు పొంది ఉండాలి. అదనంగా, ఈ ప్రొగ్రామ్‌లో పాల్గొనేవారు తప్పనిసరిగా ఒక ముఖ్యమైన మైలరాయిని సాధించి ఉండాలి. అంటే.. గత 3 నెలల్లో వారి ట్వీట్లపై కనీసం 5 మిలియన్ల ఇంప్రెషన్‌లను పొంది ఉండాలి. ఈ మానిటైజేషన్ కోసం అప్లయ్ చేసే దరఖాస్తుదారులు తప్పనిసరిగా కఠినమైన హ్యుమన్ రివ్యూ ప్రాసెస్ విజయవంతంగా పూర్తి చేయాలి. ఈ ప్రక్రియను (Creator Monetization Standards)గా పిలుస్తారు. ఈ దశలో నైతిక మార్గదర్శకాలను సమర్థించే ప్లాట్‌ఫారమ్ పర్యావరణ వ్యవస్థకు సానుకూలంగా సహకరించే అర్హులైన క్రియేటర్లు మాత్రమే యాడ్స్ రెవిన్యూ షేరింగ్ అవకాశాన్ని యాక్సెస్ చేయగలరని గమనించాలి.

Dukaan Replaces Staff With Ai Chatbot: ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తో భారీగా ఊడిన ఉద్యోగాలు, 90 శాతం ఎంప్లాయిస్‌ను తీసేసిన దుకాన్ కంపెనీ 

మీరు క్రియేటర్ మానిటైజేషన్ షేరింగ్ ప్రొగ్రామ్‌కు ఆమోదం పొందిన తర్వాత కొన్ని ముఖ్యమైన రెక్వైర్‌మెంట్స్ తప్పనిసరిగా రీచ్ కావాలి. ముందుగా, మీరు Stripe అకౌంట్ సెటప్ చేయాలి. పేమెంట్లను పొందడానికి ఈ అకౌంట్ చాలా కీలకం. మీరు ఇప్పటికే క్రియేటర్ సబ్‌స్క్రిప్షన్‌లలో ఎన్‌రోల్ చేసి ఉంటే.. క్రియేటర్ల ప్రారంభ గ్రూపులో భాగమైతే.. మీరు ఈ దశను కొనసాగించడానికి అర్హులుగా చెప్పవచ్చు. రెండవది.. ట్విట్టర్ క్రియేటర్ సభ్యత్వాల విధానాలకు కట్టుబడి ఉండాలి.

Twitter vs Threads: డేటా గోప్యత లేదు, విడుదలకు ముందే మెటా థ్రెడ్‌ యాప్‌కు ఎదురుదెబ్బ, ట్విటర్‌ బాస్‌ ఎలాన్‌ మస్క్‌ స్పందన ఇదిగో.. 

మీకు 18 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉండాలి. వెరిఫైడ్ ఇమెయిల్ అడ్రస్, పూర్తి ప్రొఫైల్‌ను కలిగి ఉండాలి. అంతేకాదు.. టూ ఫ్యాక్టర్డ్ అథెంటికేషన్ కూడా ఎనేబుల్ చేసి ఉండాలి. ట్విట్టర్ యూజర్ అగ్రిమెంట్ పదేపదే ఉల్లంఘించిన హిస్టరీని కలిగి ఉండరాదు. కనీసం 500 మంది యాక్టివ్ ఫాలోవర్లు కలిగి ఉండాలని పాలసీ సూచిస్తోంది. ఆసక్తి గల వినియోగదారులు ట్విట్టర్ FAQ పేజీలో ‘Creator Ads Revenue Sharing’ కోసం చెక్ చేసుకోవచ్చు.

ట్విట్టర్ యజమాని ఎలన్ మస్క్ ఫిబ్రవరిలో ఈ ప్రొగ్రామ్ మొదట ప్రకటించారు. అయితే, యాడ్స్ రెవిన్యూ షేరింగ్ కోసం ట్విట్టర్ ఇంకా అప్లికేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించలేదు. అయితే, కంపెనీ ప్రకారం.. దాని కోసం పోర్టల్ దాదాపు 72 గంటల తర్వాత అందుబాటులో ఉంటుంది. ఈ ఆప్షన్ వచ్చే సోమవారం లేదా మంగళవారం అందుబాటులో ఉండే అవకాశం ఉంది. క్రియేటర్లు తమ సెట్టింగ్‌లలో మానిటైజేషన్‌ని యాక్సెస్ చేయడం ద్వారా క్రియేటర్ సబ్‌స్క్రిప్షన్‌లు, క్రియేటర్ యాడ్స్ రెవిన్యూ షేరింగ్ రెండింటికీ అప్లయ్ చేసుకోవాలి. యాడ్స్ రెవిన్యూ షేరింగ్ అప్లికేషన్ ప్రాసెస్ కోసం పోర్టల్ లేదా పేజీ త్వరలో ప్రారంభం కానుందని ట్విట్టర్ పేర్కొంది.

ట్విట్టర్ యూజర్లకు ఎంత డబ్బు ఇస్తోందంటే?

ది వెర్జ్ ప్రకారం..క్రియేటర్ సబ్‌స్క్రిప్షన్‌లలో రిజిస్టర్ చేసుకున్న మిలియన్ కన్నా ఎక్కువ మంది ఫాలోవర్లు కలిగిన అకౌంట్లు.. ప్రస్తుతం కొన్ని వేల డాలర్ల నుంచి దాదాపు 40వేల డాలర్లు (సుమారు రూ. 32.8 లక్షలు) వరకు పేమెంట్లను అందుకుంటున్నారు. ప్రముఖ యూట్యూబర్ మిస్టర్ బీస్ట్ (జేమ్స్ డొనాల్డ్‌సన్) ప్రకటన-భాగస్వామ్య ఆదాయంలో భాగంగా ట్విట్టర్ నుంచి 25వేల డాలర్లు (రూ. 21 లక్షలు) సంపాదించారని కూడా ఒక ట్వీట్ వైరల్ అవుతోంది. చాలా మంది వినియోగదారులు రూ.5 లక్షలకు పైగా పరిహారంగా పొందినట్టు నివేదికలు చెబుతున్నాయి.